లెజెండ్ అల్లుళ్ల పరిస్థితి దారుణం.. టీడీపీలో ఇదే చర్చ బాస్
సినీ లెజెండ్ బాలకృష్ణ ఇద్దరి అల్లుళ్ల పరిస్థితి దారుణంగా ఉందా ? రాజకీయాల్లో వారిద్దరూ పెద్దగా రాణించలేక పోతున్నారా? ఇ ప్పుడు ఇవే అంశాలపై టీడీపీలో పెద్ద [more]
సినీ లెజెండ్ బాలకృష్ణ ఇద్దరి అల్లుళ్ల పరిస్థితి దారుణంగా ఉందా ? రాజకీయాల్లో వారిద్దరూ పెద్దగా రాణించలేక పోతున్నారా? ఇ ప్పుడు ఇవే అంశాలపై టీడీపీలో పెద్ద [more]
సినీ లెజెండ్ బాలకృష్ణ ఇద్దరి అల్లుళ్ల పరిస్థితి దారుణంగా ఉందా ? రాజకీయాల్లో వారిద్దరూ పెద్దగా రాణించలేక పోతున్నారా? ఇ ప్పుడు ఇవే అంశాలపై టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు కూడా ఇవే అంశాలపై చర్చిం చుకుంటున్నారు. గత ఏడాది ఎన్నికలకు ముందు బాలయ్య చిన్నల్లుడు భరత్ రాజకీయాల్లోకి వచ్చారు. బాలయ్య పెద్దల్లుడు.. టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ అనే విషయం తెలిసిందే. ఆయన 2014కు ముందు చంద్రబాబు నిర్వహించిన వస్తున్నా మీకోసం యాత్ర సమయంలో పార్టీలోకి అడుగు పెట్టారు. ఆ యాత్రకు సంబంధించిన అన్ని విషయాలను దగ్గరుండి చూసుకున్నారు. డిజిటల్ ప్లాట్ ఫాంపై పార్టీని పరుగులు పెట్టించారు. సభ్యత్వ నమోదు నుంచి స్థానికంగా పార్టీ వ్యవహారాల వరకు అన్నింటినీ.. డిజిటలైజ్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు.
ఇద్దరు అల్లుళ్లు ప్రత్యక్ష రాజకీయాల్లో…..
ఈ క్రమంలోనే 2014లో లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయకపోయినా.. 2017లో జరిగిన ప్రభుత్వ మంత్రి వర్గ విస్తరణ సమయంలో లోకేష్‌కు మండలి సభ్యత్వం ఇచ్చి.. ప్రభుత్వంలో మంత్రిగా తీసుకున్నారు. లోకేష్ ఎమ్మెల్సీ అయిన రెండు రోజులకే మంత్రి అయ్యి ఓ రికార్డు సృష్టించినా దీనిపై అనేక విమర్శలు సైతం వచ్చాయి. దీంతో రెండున్నర సంవత్సరాల పాటు లోకేష్ మంత్రిగా చక్రం తిప్పారు. అయితే, ఈ ఇద్దరు యువనాయకులు గత ఏడాది ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేశారు. లోకేష్ శాసన సభకు పోటీ చేయగా.. మతుకుమిల్లి భరత్ విశాఖ నుంచి ఎంపీగా రంగంలోకి దిగారు. గీతం యూనివర్సిటీ సీఈవో గా ఉంటూనే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తొలి ప్రయత్నంలోనే గెలుపు గుర్రం ఎక్కేందుకు భరత్ శ్రమించారు. ఈ క్రమంలో విశాఖ ఎంపీ ఎన్నికల్లో ఆయన దాదాపు 4 ,32,429 ఓట్లు వచ్చాయి. కానీ, ఇక్కడ నుంచి గెలిచిన వైసీపీ అభ్యర్థి సత్యనారాయణకు మరో మూడు వేల ఓట్లు అధికంగా రావడంతో భరత్ ఓటమిపాలయ్యారు. జనసేన నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇక్కడ పోటీ చేసి భారీగా ఓట్లు చీల్చడంతోనే భరత్ ఓడిపోవాల్సి వచ్చింది.
వచ్చే ఎన్నికల్లోనూ అక్కడి నుంచే….
ఇక, లోకేష్ విషయానికి వస్తే.. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ పోటీని కూడా చాలా ప్రతిష్టాత్మ కంగా తీసుకున్నారు. కానీ, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దూకుడు ముందు లోకేష్ నిలవలేక పోయారు. నిజానికి తన సతీమణి, తల్లి, మామ బాలయ్యను కూడా రంగంలోకి దింపి.. ప్రచారం చేయించినా.. ఫలితం దక్కలేదనే నిర్వేదం లోకేష్‌లో ఉంది. పైగా మంగళగిరిని పలకలేక పోవడం కూడా పెద్ద వ్యతిరేక ప్రచారంగా మారింది. మొత్తంగా లోకేష్ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఏడాది గడిచి పోయింది. ఈ ఏడాది కాలంలో ఈ ఇద్దరు అల్లుళ్ల గ్రాఫ్ ఎలా ఉంది? అంటే.. భరత్ ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నారు. అయితే, ఆయన వచ్చే ఎన్నికల్లోనూ విశాఖ నుంచే రంగంలోకి దిగనున్నారనేది ఆయన వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతోంది. పార్టీ ఓడిపోయినా ప్రజల్లోనే ఉంటోన్న భరత్ తన తాత దివంగత నేత ఎంవీవీఎస్. మూర్తి రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తానని చెపుతున్నారు. ఆయన ప్రయత్నాలు కూడా ఆ దిశగానే సాగుతున్నాయి.
మంగళగిరిని మార్చేయాలని…..
ఇక లోకేష్ విషయానికి వస్తే.. మంగళగిరి నుంచి పోటీ చేసి తప్పుచేశామా? అనే ఆవేదన కనిపిస్తుండడం గమనార్హం. మంగళగిరి కాకుండా పార్టీకి పట్టున్న మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఉంటే ఫలితం ఉండేదనే వాదన ఏడాది కిందటి నుంచే వినిపిస్తోంది. దీంతో ఓడిపోయిన తర్వాత కూడా ఒకటిరెండు సార్లు నియోజకవర్గంలో పర్యటించి.. తాను మళ్లీ పోటీ చేస్తే.. మంగళగిరి నుంచే పోటీ చేస్తానని ప్రకటించినా.. తర్వాత మాత్రం మనసు మార్చుకున్నారని, తనకు అనువైన నియోజకవర్గం కోసం చూసుకుంటున్నారని లోకేష్ గురించి సీనియర్లు చర్చించుకుంటున్నారు. ఏడాది అవుతున్నా లోకేష్ మాత్రం మంగళగిరి కాకపోతే ఇప్పటకి మరో అనువైన నియోజకవర్గం కోసం వెతుకుతున్నా ఇప్పటకీ దొరకలేదన్న గుసగుసలు టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే లోకేష్, భరత్ టార్గెట్లతో పోల్చి చూసినప్పుడు భరత్ తనకున్న పరిమితమైన విశాఖ రాజకీయాల్లోనే కాస్త ముందున్నాడని పిస్తోంది. మొత్తంగా చూస్తే.. బాలయ్య ఇద్దరు అల్లుళ్ల పరిస్థితి ప్రస్తుతం ఏమంత ఆశాజనకంగా లేదనేది వాస్తవం. లోకేష్ అధికార పార్టీ వైసీపీపై విమర్శలు చేస్తున్నా.. ఆశించిన రేంజ్‌లో అవి వర్కవుట్ కావడం లేదని అంటున్నారు. భరత్ అసలు.. ఎక్కడా విమర్శలకు తావివ్వకుండా వ్యవహరిస్తున్నారు. మరి ఈ ఇద్దరు ఎలా సక్సెస్ అవుతారో ? చూడాలి.