శభాష్….రాయుడు… ఇలాంటి నేతలను గుర్తుపెట్టుకో బాబూ

ఇప్పుడు చంద్రబాబు మెచ్చుకోవాల్సిందీ.. భవిష్యత్తులో పదవులు లాంటివి ఇవ్వాల్సిందీ ఇలంటి నాయకులకే. తెలుగుదేశం పార్టీ మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఒకవైపు అక్రమ [more]

Update: 2020-09-09 02:00 GMT

ఇప్పుడు చంద్రబాబు మెచ్చుకోవాల్సిందీ.. భవిష్యత్తులో పదవులు లాంటివి ఇవ్వాల్సిందీ ఇలంటి నాయకులకే. తెలుగుదేశం పార్టీ మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఒకవైపు అక్రమ కేసులు, మరో వైపు ఆర్థికంగా పార్టీ ఇబ్బందులు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు తలనొప్పలు తెస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీకి అండగా నిలచిన వాళ్లే అసలైన నాయకులు. సిసలైన లీడర్లు. అలాంటి నాయకుల్లో ఒకరు బత్యాల చెంగల్రాయుడు అని చెప్పక తప్పదు.

అన్నీ పదవులు అనుభవించిన వాళ్లే…..

పార్టీ పదవులను అనుభవించిన వాళ్లే పదిహేను నెలల నుంచి మొఖం చాటేశారు. మంత్రులుగా పనిచేసిన వాళ్లు పత్తా లేకుండా పోయారు. తొలి నుంచి పార్టీలో ఉన్నామని గొప్పలు చెప్పుకునే వాళ్లే తప్ప పార్టీ కష్టసమయంలో వాయిస్ విన్పించేవాళ్లు టీడీపీలో ప్రస్తుతం కరువయ్యారు. కేవలం కొందరు మాత్రమే కన్పిస్తున్నారు. అలాంటి వారిలో బత్యాల చెంగల్రాయుడు ఒకరు. నిజానికి బత్యాల చెంగల్రాయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. అయినా వైఎస్ మరణం తర్వాత ఆయన జగన్ పార్టీ నుంచి పిలుపు వచ్చినా వెళ్లకుండా టీడీపీలో చేరారు.

వైఎస్ కు సన్నిహితుడైనా…..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన సన్నిహితుడైన బత్యాల చెంగల్రాయుడికి రాజంపేట ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకపోయినా ఎమ్మెల్సీని చేశారు. ఇక టీడీపీలో చేరిన బత్యాల చెంగల్రాయుడికి గత ఎన్నికల్లో చంద్రబాబు రాజంపేట టిక్కెట్ ఇచ్చారు. అయితే కడప జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం, జగన్ హవా ముందు ఓటమి పాలయ్యారు. కానీ అందరి నేతల్లాగా బత్యాల చెంగల్రాయుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం లేదు. ఫుల్లు యాక్టివ్ గా ఉన్నారు.

ఫుల్లు యాక్టివ్ గా…..

బలిజ సామాజిక వర్గానికి చెందిన బత్యాల చెంగల్రాయుడుకు రైల్వే కోడూరు నియోజకవర్గంలో పట్టుంది. అయితే ఆ నియోజకవర్గం రిజర్వ్ డ్ కావడంతో రాజంపేట కు షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాల్లోనూ రెండు నియోజకవర్గాల్లో బత్యాల చెంగల్రాయుడు చేస్తున్నారు. ఇక టీవీ షోల్లో కూడా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. చంద్రబాబుకు అండగా నిలుస్తున్నారు. నిజంగా కష్ట సమయంలో అందరూ వదిలేసి వెళ్లిన పరిస్థితుల్లో బత్యాల చెంగల్రాయుడు లాంటి నేతలు కొద్దిమంది ఉంటే చాలు పార్టీకి ఢోకాలేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. శభాష్ చెంగల్రాయుడూ అంటూ టీడీపీ సోషల్ మీడియాలో సయితం కామెంట్స్ విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News