బత్యాల ను బత్తాయి చేసేశారా?

ఆయన నిన్న మొన్నటి వరకూ పార్టీలో యాక్టివ్ గా ఉండేవారు. కానీ చంద్రబాబు ఆయనకు ఎటువంటి పదవులు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం మౌనంగానే ఉన్నారు. తిరుపతిలోని తన వ్యాపారాలకే [more]

Update: 2020-12-09 05:00 GMT

ఆయన నిన్న మొన్నటి వరకూ పార్టీలో యాక్టివ్ గా ఉండేవారు. కానీ చంద్రబాబు ఆయనకు ఎటువంటి పదవులు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం మౌనంగానే ఉన్నారు. తిరుపతిలోని తన వ్యాపారాలకే పరిమితమయ్యారు. ఆయనే కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత బత్యాల చెంగల్రాయుడు. ఈయన పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ ఛార్జులు, రాష్ట్ర కమిటీలు ప్రకటించిన తర్వాత కన్పించకుండా పోయారు. పార్టీ అధినాయకత్వంపై బత్యాల చెంగల్రాయుడు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

ఫుల్లు యాక్టివ్ గా ఉండి….

2019 లో తెలుగుదేశం పార్టీ దారుణ ఓటమి చవి చూసిన తర్వాత అప్పటి వరక పదవులు అనుభవించిన నేతలందరూ పక్కకు తప్పుకున్నారు. కేసుల భయం, వ్యాపార ప్రయోజనాలు కావచ్చు. సీనియర్ నేతలందరూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ బత్యాల చెంగల్రాయుడు మాత్రం వెంటనే యాక్టివ్ అయ్యారు. పార్టీ స్టాండ్ ను బలంగా విన్పించడంలో ఆయన ముందుండే వారు.

పార్టీ పదవులను…..

కానీ కొద్దిరోజుల క్రితం చంద్రబాబు పార్టీ పదవులను భర్తీ చేశారు. సీనియర్ నేత అయిన తనకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా జూనియర్లకు ఉన్నత స్థాయి పదవులను కట్టబెట్టారని బత్యాల చెంగల్రాయుడు భావిస్తున్నారు. నిజానికి బత్యాల చెంగల్రాయుడు కాంగ్రెస్ పార్టీలో ఎదిగారు. ఆయనను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తించి ఎమ్మెల్సీని చేశారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో పట్టున్న బత్యాల చెంగల్రాయుడు రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు.

పట్టించుకోవడం లేదని…..

టీడీపీలో కీలక నేతగా ఎదగాలని భావించారు. కానీ ఆయనను పార్టీ పట్టించుకోకపోవడంపై అనుచరులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పదవులను భర్తీ చేసిన తర్వాత బత్యాల చెంగల్రాయుడు కన్పించడమే మానేశారు. పార్టీ కార్యక్రమాలకు కూడా బత్యాల చెంగల్రాయుడు దూరంగా ఉంటున్నారు. యాక్టివ్ గా ఉండే నేతలకు కాకుండా ఆర్థిక బలం ఉన్నవారికే పదవులు ఇచ్చారన్న విమర్శలను అధిష్టానంపై బత్యాల వర్గం ఆరోపిస్తుంది.

Tags:    

Similar News