దిగ్భంధనం చేసినట్లేనా?

జయలలిత సన్నిహితురాలు శశికళ జైలు నుంచి బయటకు రాకమునుపే ఆమె ఆస్తులన్నింటినీ ఆదాయపు పన్ను శాఖ సీజ్ చేసింది. శశికళ ఆస్తుల్లో సింహభాగం ఇప్పటికే ఐటీ అధికారులు [more]

Update: 2020-09-01 18:29 GMT

జయలలిత సన్నిహితురాలు శశికళ జైలు నుంచి బయటకు రాకమునుపే ఆమె ఆస్తులన్నింటినీ ఆదాయపు పన్ను శాఖ సీజ్ చేసింది. శశికళ ఆస్తుల్లో సింహభాగం ఇప్పటికే ఐటీ అధికారులు అటాచ్ చేశారు. శశికళ జయలలిత అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. శశికళ జైలు శిక్ష కూడా త్వరలోనే ముగియనుంది. ఈకేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడి పరప్పణ అగ్రహారం జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

మూడు వందల కోట్ల ఆస్తులను….

అయితే శశికళ జైలు నుంచి విడుదల అయ్యే లోపే ఆమెకు చెందిన ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ అటాచ్ చేసింది. మూడు వందల కోట్ల విలువైన ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ అటాచ్ చేసింది. ఇందులో బహుళ అంతస్థుల భవనంతో పాటు మరో 65 ఆస్తులు ఉన్నాయి. బినామీ కంపెనీ ద్వారా శశికళ ఈ ఆస్తులను కూడబెట్టినట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. అనేక షెల్ కంపెనీలు ఉన్నట్లు కూడా గుర్తించింది.

అప్పుడే ఆస్తులను కూడబెట్టి….

పెద్దనోట్ల రద్దు సమయంలోనే శశికళ ఎక్కువగా ఈ ఆస్తులను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కేవలం పెద్దనోట్ల రద్దు సమయంలోనే దాదాపు 16వందల కోట్ల ఆస్తులను శశికళ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. దీంతో పాటు 237 కోట్ల పాతనోట్లను ఒక వ్యాపారికి శశికళ రుణంగా ఇచ్చారని కూడా చెబుతున్నారు. దీనిపై బెంగళూరు జైలులో ఉన్న శశికళకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు కూడా జారీ చేసింది.

ఉందామనుకున్న ఇంటిని కూడా…

దీంతో శశికళను పూర్తిగా ఆర్థికంగా దిగ్భంధనం చేసినట్లయింది. శశికళ జైలు నుంచి విడుదలయిన తర్వాత జయలలిత నివసించిన వేదనియలం ఎదురుగా ఉన్న స్థలంలో భవనం నిర్మించుకుని ఉందామనుకున్నారు. భవన నిర్మాణపనులు కూడా ప్రారంభమయ్యాయిి ఇది కూడా ఆదాయపుపన్ను శాఖ జప్తు చేసింది. దీంతో శశికళ జైలు నుంచి విడుదల కాకముందే ఆమెకు కష్టాలు ప్రారంభమయ్యాయనే చెప్పాలి.

Tags:    

Similar News