ఇలా చేస్తేనే గెలుస్తుందా…?

ఛత్తీస్ ఘడ్ లో రమణ్ సింగ్ లోక్ సభ ఎన్నికల్లో సత్తా చూపుతారా? బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి తెస్తారా? అంటే అవుననే [more]

Update: 2019-04-05 18:29 GMT

ఛత్తీస్ ఘడ్ లో రమణ్ సింగ్ లోక్ సభ ఎన్నికల్లో సత్తా చూపుతారా? బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి తెస్తారా? అంటే అవుననే చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్ ఘడ్ ను కోల్పోయిన బీజేపీ లోక్ సభ ఎన్నికల్లోనైనా పుంజుకుంటుందా? రమణ్ సింగ్ ఏ మేరకు విజయం సాధిస్తారు..? అజిత్ జోగి వంటి నేతలు పోటీ నుంచి తప్పుకోవడం బీజేపీకి లాభమా..? నష్టమా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో…..

ఛత్తీస్ ఘడ్ చిన్న రాష్ట్రం, ఇక్కడ కేవలం 11 లోక్ సభ స్థానాలు మాత్రమే ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. పదిహేనేళ్లు అప్రతిహతంగా రాష్ట్రాన్ని పాలించిన రమణ్ సింగ్ కు కాంగ్రెస్ చెక్ పెట్టగలిగింది. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం రమణ్ సింగ్ పై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. మెజారిటీ స్థానాలను సాధిస్తారన్న నమ్మకాన్ని చావల్ బాబాపై ఉంది. రమణ్ సింగ్ కు ఛత్తీస్ ఘడ్ లో చావల్ బాబాగా పేరుంది. ఆయన ఎటువంటి ఆర్భాటాలకు పోకుండా తన పని తాను చేసుకుపోతారు.

రమణ్ సింగ్ లో ధీమా….

గిరిజనుల్లోనూ రమణ్ సింగ్ పట్ల సానుకూలత ఉంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు, జీఎస్టీ వంటివి పనిచేయడంతో ఛత్తీస్ ఘడ్ లో రమణ్ సింగ్ తన పార్టీని విజయపథాన నడపలేకపోయారు. ప్రస్తుతం రమణ్ సింగ్ ఛత్తీస్ ఘడ్ లోని 11 పార్లమెంటు స్థానాలపై దృష్టి పెట్టారు. అన్నింటిని గెలుచుకుని తిరిగి తన సత్తా చాటాలని ఉబలాటపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ఆయన ప్రజల దృష్టికి తీసుకెళుతున్నారు.

సిట్టింగ్ లకు నో ఛాన్స్…..

ఇక ఛత్తీస్ ఘడ్ లో భారతీయ జనతా పార్టీ కొత్త విధానాన్ని అవలంబించింది. ఇది కూడా తమకు కలసి వస్తుందని భావిస్తోంది. మొత్తం 11 ఎంపీ సీట్లకు గాను పది ఎంపీ సీట్లలో సిట్టింగ్ లకు తిరిగి టిక్కెట్ ఇవ్వలేదు. అంతర్గత సర్వేల ఆధారంగా సిట్టింగ్ ఎంపీలకు టిక్కెట్లు నిరాకరించినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీలపై ఉన్న వ్యతిరరేకత నుంచి బయటపడటానికి ఛత్తీస్ ఘడ్ లో కమలం పార్టీ కొత్తవారిని రంగంలోకి దించింది. మరి ఇది ఎంత మేరకు ఫలితాలనిస్తుందో చూడాలి. రమణ్ సింగ్ మరోసారి సత్తా ను చాటుతారో లేదో తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News