పవన్ టార్గెట్ రీచ్ అవుతారా?

మొత్తానికి జగన్ సర్కార్ స్థానిక ఎన్నికల కు ఇచ్చిన నోటిఫికేషన్ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విపక్షాలు యుద్ధానికి సిద్ధం అయిపోతున్నాయి. ఉన్న తక్కువ సమయంలో వనరులన్ని [more]

Update: 2020-03-09 03:30 GMT

మొత్తానికి జగన్ సర్కార్ స్థానిక ఎన్నికల కు ఇచ్చిన నోటిఫికేషన్ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విపక్షాలు యుద్ధానికి సిద్ధం అయిపోతున్నాయి. ఉన్న తక్కువ సమయంలో వనరులన్ని సమీకరించుకుని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై ప్రధాన పార్టీలన్ని గట్టి ఫోకస్ నే పెట్టాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే బిజెపి తో జట్టుకట్టిన జనసేన పార్టీలు ముందుగా తమ ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టే పనిలో బిజీ అయ్యాయి. అర్జెంట్ గా ఆ రెండు పార్టీలకు ఉమ్మడి ప్రణాళిక మ్యానిఫెస్టో తక్షణ అవసరమని గుర్తించాయి. దీనితో పాటు ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసేందుకు భేటీ అయ్యి అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించాయి.

వారికి మంచి అవకాశం …

వాస్తవానికి బిజెపి, జనసేన లకు క్షేత్ర స్థాయిలో పటిష్ట క్యాడర్ లేదు. బిజెపి కి కొంతవరకు అన్ని చోట్లా కార్యవర్గాలు అయితే వున్నాయి అయితే మాస్ ఫాలోయింగ్ లేదు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గోదావరి జిల్లాల్లో బాగానే ఫాలోయింగ్ ఉంది. అయితే అది చివరికి వచ్చే సరికి ఓటు గా కన్వర్ట్ కాకపోవడం ఆ పార్టీకి పెద్ద లోటు గా పరిణమించింది. అందుకే దిశా దశా కార్యక్రమాన్ని బిజెపి చూసుకుంటే మిగిలిన ప్రచార బాధ్యతలు తలకెత్తుకోవాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కశాతానికి లోపు బిజెపి ఉంటే ఆరు శాతం ఓటు బ్యాంక్ ను జనసేన సాధించింది. 2 లక్షల 63 వేల ఓట్లు బిజెపి కి 21 లక్షల 30 వేల ఓట్లు జనసేన సాధించింది.

అభ్యర్థులే అసలు సమస్య …

అయితే స్థానిక ఎన్నికలు అనేవి స్థానిక అంశాలు ప్రధాన అంశంగా సాగుతాయి. పార్టీల ప్రమేయం కన్నా స్థానికంగా బలమైన అభ్యర్థులు ఉన్న పార్టీనే విజయతీరాలు చేరుతుంది. ఏ ఎన్నికలు అయినా ప్రధానపక్షాలు ముఖ్యంగా అధికారపార్టీ సీట్ల కోసమే అంతా ఎగబడతారు. అధికారపక్షంలో సీటు లభించనప్పుడు ప్రధాన ప్రతిపక్షం వైపు దృష్టి పెడతారు. అక్కడా నో సీటు అంటే స్వతంత్రులుగా దిగే పరిస్థితులు ఉంటాయి. కానీ ఈసారి బలమైన మూడోపక్షంగా బిజెపి జనసేన లు ప్రత్యామ్నాయంగా అభ్యర్థులకు ఛాన్స్ ఇవ్వనున్నాయి. అధికార వైసిపి, ప్రధాన విపక్షం టిడిపి లనుంచి టికెట్స్ దక్కని పక్షంలో మూడో పక్షం వైపుకి బలమైన అభ్యర్థులు మొగ్గు చూపే పక్షంలో ఎన్నికలు కొన్ని ప్రాంతాల్లో ఆసక్తికరంగా మారనుంది. ఇప్పుడు బిజెపి – జనసేన ఆఘమేఘాలపై అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఈ అన్వేషణలో వారివైపు చూసేవారు ఎందరు ఉంటారనేది చూడాల్సివుంది. మరోపక్క ప్రధాన పక్షాల నుంచి టికెట్ దక్కని బలమైన రెబెల్స్ కి బిజెపి జనసేన వ్యూహాత్మక మద్దతు ప్రకటిస్తే మాత్రం కొన్ని స్థానాలు దక్కే అవకాశాలు ఉండొచ్చు. క్షేత్ర స్థాయిలో బలాన్ని చాటినప్పుడే 2024 టార్గెట్ అంటున్న ఈ పార్టీలకు సార్వత్రిక ఎన్నికల్లో ఉనికి చాటుకునే ఛాన్స్ ఉంటుంది. చూడాలి ఈ పొత్తు పార్టీలు అద్భుతాలు చేస్తాయా లేక గతంలోలాగే చతికిలపడతాయో.

Tags:    

Similar News