బీజేపీ టార్చర్ పెడుతుందా ?
ఏపీలో ఎదగాలన్నది బీజేపీ ఆశ. ఆలోచన. దానికి ఎప్పటి నుంచో పావులు కదుపుతూ వస్తోంది. దేశమంతా వాజ్ పేయికి జై కొట్టినా కూడా ఏపీ జనాలు ఉలకలేదు, [more]
ఏపీలో ఎదగాలన్నది బీజేపీ ఆశ. ఆలోచన. దానికి ఎప్పటి నుంచో పావులు కదుపుతూ వస్తోంది. దేశమంతా వాజ్ పేయికి జై కొట్టినా కూడా ఏపీ జనాలు ఉలకలేదు, [more]
ఏపీలో ఎదగాలన్నది బీజేపీ ఆశ. ఆలోచన. దానికి ఎప్పటి నుంచో పావులు కదుపుతూ వస్తోంది. దేశమంతా వాజ్ పేయికి జై కొట్టినా కూడా ఏపీ జనాలు ఉలకలేదు, పలకలేదు. ఇక మోడీ వేవ్ భయంకరంగా 2014 ఎన్నికల వేళ దేశంలో వీచింది. అయినా కూడా ఏపీ పొలాల్లో ఎక్కడా కమలం విత్తనాలు మొలవలేదు. ఇపుడు కాకపోతే మరెప్పుడు అన్న కసి అయితే బీజేపీలో నానాటికీ పెరిగిపోతోంది. అన్నీ ప్రయోగాలూ అయిపోయిన వేళ ఏపీలో కమల విలాపమే మిగిలింది.
తిరుపతి తరువాత…?
ఇక తిరుపతి ఫలితం విషయంలో బీజేపీ ఒక అంచనా వేసుకుంది. కనీసంగా లక్షన్నర ఓట్లు అయినా రావాలి అన్నది బీజేపీ ఆలోచన. అవి తగ్గి ఏ యాభై వేలకో పడిపోతే మాత్రం బీజేపీ చూస్తూ ఊరుకోదు అంటున్నారు. ఏపీని నయానో భయానో దారికి తెచ్చుకోవడానికే పక్కా ప్లాన్ తో ముందుకు దూకుతుంది అని అంటున్నారు. ఏపీలో జనాలు బీజేపీ వైపు మొగ్గు చూపకపోతే పోవచ్చు కానీ రాజకీయం మాత్రం తనకు అనుకూలంగానే ఉంటుందని బీజేపీ నమ్ముతోంది. రెండు బలమైన ప్రాంతీయ పార్టీల అధినేతల బలహీనతలే పెట్టుబడిగా బీజేపీ సరికొత్త రాజకీయానికి తెర తీసే అవకాశాలు కూడా కొట్టిపారేయలేము అంటున్నారు.
జగనే ఫస్ట్ …?
ఇప్పటికే కేంద్రంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమికి బీటలు వారాయి. తాజాగా మరో పార్టీ కూడా బయటకు వచ్చేసింది. దాంతో 2024 ఎన్నికలు బీజేపీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అందువల్ల జగన్ మీద బీజేపీ తీవ్ర వత్తిడి పెట్టే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. జగన్ ని కేంద్రంలోని కూటమిలో చేరాలని ఇక మీదట టార్చర్ పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని కూడా అంటున్నారు. జగన్ తన రాజకీయ లాభనష్టాలను బేరీజు వేసుకుని నో చెబితే మాత్రం బీజేపీ విశ్వరూపమే చూడాల్సి ఉంటుందని కూడా ఢిల్లీ వార్తలు చెబుతున్న సమాచారం.
సంచలనాలే…?
తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఏపీ రాజకీయాల్లో సంచలనాలే నమోదు అవుతాయని అంటున్నారు. బీజేపీ ఎకాఎకిన టీడీపీతో పొత్తు కలిపేసి వారి పక్కన చేరుతుంది అన్నది ఇప్పట్లో జరిగేది కాదని అంటున్నారు. బీజేపీ ఫస్ట్ ప్రయారిటీ వైసీపీయే అంటున్నారు. జగన్ నే నయానో భయానో దారికి రప్పించుకోవాలన్నదే బీజేపీ అజెండా అని చెబుతున్నారు.జగన్ ఈ విషయంలో మొండిగా వ్యవహరించినా లేక బీజేపీకి దూరం పాటించినా కూడా ఏపీ రాజకీయాల్లో భారీ తేడాలు వస్తాయని కూడా అంచనా వేస్తున్నారు. బీజేపీతో కలసి అడుగులు వేయకపోతే కేంద్ర పెద్దలు ఇక మీదట చూస్తూ ఊరుకోరని, దానికి తగిన కాషాయ మంత్రాంగాన్ని రెడీ చేసి పెట్టారని ఢిలీ కబురు మోసుకొస్తున్న వర్తమానం. మొత్తానికి జగన్ కి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా బీజేపీ తో వ్యవహారం ఉండబోతోంది అన్నది ఒక విశ్లేషణ. చూడాలి మరి ఏం జరుగుతుందో.