నిలదొక్కుకోవాలంటే ఇలాగే చేయాలా?

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నిలదొక్కుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. అందుకే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో దేవాలయాల యాత్రకు శ్రీకారం చుట్టిన [more]

Update: 2021-08-11 09:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నిలదొక్కుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. అందుకే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో దేవాలయాల యాత్రకు శ్రీకారం చుట్టిన తీరును ఉదాహరణగా చూపిస్తున్నారు. రాజకీయాలు మొత్తం కులం, మతం, ప్రాంతాల చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇందులో కులాల ఈక్వేషన్లు ఎన్నికల్లో సీట్ల సమయంలో పనికొస్తే మతం మాత్రం ఎప్పుడు మత్తుమందులా భావోద్వేగాలను ప్రజల్లో ప్రేరేపించే అంశమే.

తమ టార్గెట్ అంతా….

అందుకే కాషాయదళం తమ ప్రధాన టార్గెట్ ను ఎప్పుడు మతం మీదే పెడుతూ వస్తుంది. ఈ ప్రాతిపదికనే ప్రజల్లోకి చొచ్చుకువెళ్లాలని బీజేపీ చూస్తుంది. తాజాగా బీజేపీ దేవాలయాల పరిరక్షణ హిందూమతం అభివృద్ధి అనే రెండు అంశాలపై గట్టిగా ఎపి లో ఫోకస్ పెట్టింది. ఈ మార్గం ద్వారానే ప్రజల చెంతవకు వెళ్లాలని భావిస్తుంది. ఇందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించింది.

వచ్చే ఎన్నికల్లోగా …

క్రిస్టియన్ అయిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మతమార్పిడులు పెరిగాయని, దేవాలయాల పరిస్థితి క్షీణించింది అనే విషయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కమలం భావిస్తుంది. ఈ ప్రచారం ఇప్పటినుంచి మొదలు పెడితే వచ్చే ఎన్నికల నాటికి తమ వ్యూహం వర్క్ అవుట్ అవుతుందన్నది ఆ పార్టీ ఆలోచనగా ఉంది. అయితే ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, రైల్వే జోన్, పోర్ట్ లు, కడప ఉక్కు ఫ్యాక్టరి, విశాఖ ఉక్కు ఇలా అనేక అంశాలపై కేంద్రంలోని బిజెపి ముందడుగులు పడనంత కాలం స్థానిక నాయకత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించేలా లేదు.

ఈ ప్రయోగంతోనైనా?

దీంతో ఇప్పుడు ఏపీ లో తమ పార్టీని దేవుడే కాపాడాలి అన్న రీతిలో కమలం కొత్త స్ట్రేటజీ తో అడుగులు ముందుకు వేస్తున్నట్లు కనిపిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కులాల వారీగా జగన్ సర్కార్ సంక్షేమ ఫలాలను అందిస్తూ ఉండటంతో ఆ మార్గం ప్రస్తుతం వైసిపి ప్రత్యర్థులకు దాదాపు ముసుగుపోయింది. దాంతో వారు ఫ్యాన్ స్పీడ్ కి బ్రేక్ లు వేసే ఏ ఒక్క విషయం వదలిపెట్టకూడదని చూస్తున్నట్లు తెలుస్తుంది. మరి బీజేపీ ప్రయోగాలు జగన్ ముందు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

Tags:    

Similar News