Bjp : ఇక కుర్చీలు కూడా నిండటం కష్టమేనట

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఏమాత్రం ఎదగలేకపోతుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చినా ప్రయోజనం లేకుండా పోతుంది. సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం జరిగి [more]

Update: 2021-10-04 00:30 GMT

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఏమాత్రం ఎదగలేకపోతుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చినా ప్రయోజనం లేకుండా పోతుంది. సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం జరిగి ఏడాదికి పైగానే అవుతుంది. అయితే ఇప్పటి వరకూ పార్టీలో ఒక్క చేరిక కూడా లేదు. జనసేనతో పొత్తు ప్రకటించిన తర్వాత కూడా పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగుపడలేదు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళదామనుకున్నా ఎక్కడా వీలు చిక్కడం లేదు.

పుంజుకుంటుందనుకున్నా….

రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ కొంత పుంజుకుంటుందని భావించినా హామీలు అమలు చేయకపోవడం, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు పార్టీని మరింత కుంగదీశాయనే చెప్పాలి. ఇక సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను కొంత కట్ చేశారు. తొలి నుంచి ఉన్న నేతలతో పాటు, ఆర్ఎస్ఎస్ మూలాలున్న వారికే సోము వీర్రాజు ప్రాధాన్యత ఇస్తున్నారు. తొలినాళ్లలో చేరికలు ఉంటాయని భావించినా ఎవరూ బీజేపీ వైపు చూడటం లేదు.

ఈ ఎన్నికల్లో…..

ఇందుకు ప్రధాన కారణం తిరుపతి ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే. తిరుపతి ఉప ఎన్నికలో ఎన్ని ఫీట్లు చేసినా, జనసేనతో పొత్తు పెట్టుకున్నా కమలాన్ని ప్రజలు పట్టించుకోలేదు. ఇక స్థానికసంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు బీజేపీని బాగా దూరం పెట్టారు. దీంతో బీజేపీలో చేరి ప్రయోజనం లేదన్న నిర్ణయానికి వచ్చారు. అందుకే టీడీపీలో ఇబ్బంది పడుతున్న వారు సయితం బీజేపీ వైపు చూడటం లేదు.

టీడీపీ బలోపేతం అవుతుండటంతో….

అంతే కాకుండా రానున్న కాలంలో ఉన్న నేతలే పార్టీని వీడి వెళతారన్న ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కొంత పుంజుకోవడంతో ఆ నేతలు తిరిగి సొంత పార్టీవైపు చూస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్ కూడా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఎన్నికల వరకూ పవన్ ప్రయాణం బీజేపీ తో కొనసాగుతుందన్నది అనుమానమే. అందుకే ఏపీలో బీజేపీ ఇక కోలుకోవడం కష్టమే. నేతలు తమ దారి తాము చూసుకోక తప్పేలా లేదు.

Tags:    

Similar News