Bjp : ఈ ఇద్దరినీ కోవర్టులుగానే గుర్తిస్తున్నారా?

బీజేపీలో ఎప్పటి నుంచో రెండు వర్గాలున్నాయి. ఒకటి టీడీపీ అనుకూలం కాగా, మరొకటి టీడీపీ వ్యతిరేకం. బీజేపీ సొంతంగా బలోపేతం కావాలని ఒక వర్గం ఆకాంక్ష కాగా, [more]

Update: 2021-10-11 05:00 GMT

బీజేపీలో ఎప్పటి నుంచో రెండు వర్గాలున్నాయి. ఒకటి టీడీపీ అనుకూలం కాగా, మరొకటి టీడీపీ వ్యతిరేకం. బీజేపీ సొంతంగా బలోపేతం కావాలని ఒక వర్గం ఆకాంక్ష కాగా, మరో వర్గం మాత్రం టీడీపీతో పొత్తుతోనే రాజకీయంగా ఎదుగుతామని విశ్వసించే గ్రూపు మరొకటి. ఇలా చీలిపోయిన రెండు వర్గాలు పార్టీని మరింత బలహీన పర్చేలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలోపేతం కావడం అంత సులువు కాదు.

ప్రయారిటీ ఇవ్వకుండా….

కేవలం తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్న సమయంలోనే కొన్ని సీట్లయినా బీజేపీకి దక్కాయి. కానీ ఒకవర్గం ఆలోచన మాత్రం అలా లేదు. టీడీపీ వల్ల శాశ్వతంగా ఉనికి కోల్పాతామన్న అభిప్రాయంలో ఉంది. టీడీపీ నుంచి వచ్చిన నేతలకు సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ప్రయారిటీ ఇవ్వడం లేదు. టీడీపీకి అనుకూలంగా మాట్లాడిన కొందరి నేతలను పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేశారు కూడా.

టీడీపీతో పొత్తుకు….

ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మరోసారి ఇది హాట్ టాపిక్ గా మారింది. టీడీపీతో పొత్తు ఉండాలని ఒకవర్గం, కుదరదంటున్న మరో వర్గం హోరాహోరీగా తమ మాటను నెగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ లను బీజేపీలోని ఒకవర్గం దరి చేరనివ్వడం లేదు. వారిద్దరినీ చంద్రబాబు కోవర్టులుగానే వారు చూస్తున్నారు.

దూరంగా ఉంచాలని….

టీడీపీతో భవిష్యత్ లో పొత్తు ఉండబోదని, టీడీపీని టార్గెట్ చేయాల్సిందేనని బీజేపీ నేతలు బాహాటంగా చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా సుజనా చౌదరి, సీఎం రమేష్ లను ఆహ్వానించడం లేదు. వీరిద్దరూ పార్టీకి ఉపయోగపడకపోగా, టీడీపీని దగ్గరకు చేర్చే ప్రయత్నాలే ఎక్కువగా చేస్తున్నారని పార్టీ అధినాయకత్వానికి కూడా ఫిర్యాదు చేయడం విశేషం. పార్టీ తాత్కాలికంగా ఇబ్బంది పడినా కోవర్టులను దూరంగా ఉంచడమే మేలని బీజేపీలో ఎక్కువమంది నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి సుజనా చౌదరి, సీఎం రమేష్ లకు పొమ్మనలేకుండా పొగబెట్టినట్లేనని అంటున్నారు.

Tags:    

Similar News