Bjp : బీజేపీ బండారం మొత్తం అప్పుడే బయటపడుతుందట

బీజేపీకి బద్వేలు ఉప ఎన్నిక ఫలితం అనేక పాఠాలు నేర్పబోతుంది. బద్వేలు ఉప ఎన్నికల తర్వాత బీజేపీలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అందులో ప్రధానంగా ఇప్పటి [more]

Update: 2021-11-01 00:30 GMT

బీజేపీకి బద్వేలు ఉప ఎన్నిక ఫలితం అనేక పాఠాలు నేర్పబోతుంది. బద్వేలు ఉప ఎన్నికల తర్వాత బీజేపీలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అందులో ప్రధానంగా ఇప్పటి వరకూ బీజేపీని అంటిపెట్టుకుని ఉన్న నేతలు వరసగా పార్టీని వీడటం ఈ ఉప ఎన్నిక తర్వాత నుంచి ప్రారంభమవుతుందని అంటున్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందన్న నమ్మకం లేదు అయితే జనసేన పైనే నేతలు ఆశలు పెట్టుకున్నారు.

జీరో రిజల్ట్ వచ్చినా…

బీజేపీ, జనసేన కలిసి ఉంటే కొద్దోగొప్పో ప్రభావం చూపే అవకాశాలుంటాయి. అదే బీజేపీ నుంచి జనసేన విడిపోతే బీజేపీ ఏపీలో సోదిలో కూడా ఉండదు. గత ఎన్నికల ఫలితాలే తిరిగి రిపీట్ అవుతాయి. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే అనేక మంది నేతలు టీడీపీ నుంచి బీజేపీలో చేరిపోయారు. నోటా కంటే ఏపీలో తక్కువ ఓట్లు వచ్చినా తమను తాము కాపాడుకోవడం కోసం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీని ఆశ్రయించారు.

బలమని భావించి….

దానిని చూసి బీజేపీ తమ బలమని భావించింది. అయితే గడిచిన రెండున్నరేళ్లుగా బీజేపీలో బలపడింది లేదు. వరస ఎన్నికలలో దారుణ ఓటమిని మూటగట్టుకుంటుంది. మరోవైపు జనసేన బీజేపీతో కంటిన్యూ అవ్వడం కూడా డౌట్ కొడుతూ ఉంది. ఈసారి జనసేన, టీడీపీ కలసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. అందుకే ఆ కాంబినేషన్ వర్క్ అవుట్ అవుతందని బీజేపీలో అనేక మంది నేతలు భావిస్తున్నారు.

పార్టీ మారేది వారే….

బీజేపీ సిద్ధాంతాలు నమ్మి తొలి నుంచి పార్టీలో ఉన్న వారు ఈ రకమైన ఆలోచనలు చేయరు. మధ్యలో వచ్చిన వారే ఇలా పార్టీ మారేందుకు సిద్ధపడతారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లే సమయం ఉండటం, టీడీపీ కొద్దో గొప్పో పుంజుకుంటుండటం, కేసుల భయం తొలిగిపోవడంతో తిరిగి తమ గూటికి నేతలు చేరేందుకు సిద్ధమయ్యారు. బద్వేలు ఉప ఎన్నిక తర్వాత బీజేపీని వీడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి.

Tags:    

Similar News