Somu : ఉద్వాసన ఖాయమట… మరి నెక్ట్స్ ఎవరో?

బద్వేలు ఉప ఎన్నిక తర్వాత ఏపీ బీజేపీలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ను మారుస్తారన్న చర్చ జరుగుతుంది. సోము [more]

Update: 2021-11-04 09:30 GMT

బద్వేలు ఉప ఎన్నిక తర్వాత ఏపీ బీజేపీలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ను మారుస్తారన్న చర్చ జరుగుతుంది. సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించి దాదాపు ఏడాదిన్నర కావస్తుంది. గత ఏడాది ఆగస్టులో ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు. మరి కొద్ది నెలలో ఆయన పదవీ కాలం పూర్తి కానుంది. దీంతో ఆయనను మరోసారి బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశాలు లేవు.

మరింత బలహీన పడి….

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ బలపడుతుందని భావించారు. కానీ అనేక కారణాలతో మరింత బలహీన పడింది. కన్నా లక్ష్మీనారాయణను తప్పించి సోము వీర్రాజును నియమించారు. అయినా బీజేపీ ఏమాత్రం ఎదగలేదు కదా? మరింత క్షీణించింది. తిరుపతి, బద్వేలు ఉప ఎన్నికల ఫలితాలు క్యాడర్ లో మరింత నిరాశను పెంచాయి. ఆయన నాయకత్వంలో వరస అపజయాలు పార్టీకి మరింత అప్రదిష్టను తెచ్చి పెట్టాయి.

కమ్మ, కాపులకే….

ఇప్పటి వరకూ బీజేపీ రాష్ట్ర పగ్గాలు కమ్మ, కాపులకే పార్టీ పగ్గాలు అప్పగించారు. కంభం పాటి హరిబాబు తర్వాత కన్నా లక్ష్మీనారాయణ, అనంతరం సోము వీర్రాజు లకు పార్టీ బాధ్యతలను అప్పగించారు. అయితే సోము వీర్రాజును తప్పించిన తర్వాత కాపులకు కాకుండా మరో సామాజికవర్గానికి ఇవ్వాలన్నది కేంద్ర నాయకత్వం ఆలోచనగా ఉంది. ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించిదంటున్నారు.

ఈసారి రెడ్డి అట….

ఎటూ జనసేనతో పొత్తు ఉంటుంది కాబట్టి కాపులకు ఇక పార్టీ బాధ్యతలను ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తుంది. ఈ మేరకు కమ్మ లేదా రెడ్డి సామాజికవర్గానికి అధ్యక్ష పదవిని ఈసారి ఇచ్చే అవకావముందంటున్నారు. రెడ్డి సామాజికవర్గం అయితే ప్రస్తుతం పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న విష్ణువర్థన్ రెడ్డి పేరు బాగా వినపడుతుంది. పార్టీలో తొలి నుంచి ఉన్న వారికే అధ్యక్ష పదవి ఇవ్వనున్నారు. కమ్మ సామాజికవర్గం అయితే పురంద్రీశ్వరితో పాటు పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మొత్తం మీద మరికొద్ది నెలల్లో సోము వీర్రాజుకు ఉద్వాసన తప్పదని అంటున్నారు.

Tags:    

Similar News