పీకే లేకున్నా…. ఎలా గెలుస్తామో చూపించాలనేనా?

బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. రానున్న నెలల్లో పార్టీని విస్తృతంగా ప్రజల చెంతకు చేరవేసేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. బీహార్ లో ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరగనున్నాయి. కరోనా [more]

Update: 2020-07-06 17:30 GMT

బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. రానున్న నెలల్లో పార్టీని విస్తృతంగా ప్రజల చెంతకు చేరవేసేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. బీహార్ లో ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరగనున్నాయి. కరోనా తీవ్రతను బట్టి ఎన్నికల సంఘం తేదీలను నిర్ణయించాల్సి ఉంటుంది. ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉండటంతో జనతాదళ్ యు, బీజేపీ కూటములు బీహార్ లో మరోసారి పాగా వేసేందుకు సిద్ధమయ్యాయి.

గత అసెంబ్లీ ఎన్నికల్లో….

గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగడ్బంధన్ అధికారంలోకి వచ్చింది. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు కలసి మహాకూటమిగా ఏర్పడి బీజేపీపై విజయం సాధించాయి. అయితే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లాలూ కుటుంబం అవినీతితో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో బీజేపీ చేయి అందించింది. బీజేపీ మద్దతుతో నితీష్ కుమార్ గత మూడేళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీజేపీకి ఉపముఖ్యమంత్రి పదవితో పాటు మంత్రివర్గంలో స్థానం కల్పించారు.

ప్రశాంత్ కిషోర్ తప్పుకోవడంతో…..

బీహార్ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీజేపీ, జేడీయూ కూటమిగా పోటీ చేయడం ఖారరయింది. సీట్ల పంపకమే చేసుకోవాల్సి ఉంది. అయితే జేడీయూ నుంచి ప్రశాంత్ కిషోర్ పక్కకు వెళ్లిపోవడంతో కొంత ఇబ్బందికరమైన పరిణామమే. ఎందుకంటే ప్రచారం నుంచి అభ్యర్థుల ఎంపిక వరకూ ప్రశాంత్ కిషోర్ కీలక భూమికను పోషించే వారు. ఇక సోషల్ మీడియా ద్వారా కూడా ప్రశాంత్ కిషోర్ పార్టీకి హైప్ తెచ్చేవారు.

సోషల్ మీడయా ద్వారా….

ప్రశాంత్ కిషోర్ దూరం జరిగిపోవడంతో బీహార్ ఎన్నికల్లో బీజేపీ సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుక ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం బీహార్ లో బీజేపీ ప్రత్యేకంగా సోషల్ మీడియా వింగ్ ను ఏర్పాటు చేసింది. బీహార్ ఎన్నికల కోసం వేల సంఖ్యలో సోషల్ మీడియా వింగ్ లో ఉద్యోగులను బీజేపీ నియమించుకుంది. ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు ప్రతిపక్ష పార్టీల నైజాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా బీజేపీ ఎండగట్టనుంది.

డిజిటల్ ప్రచారం…

ఇక కరోనా వైరస్ బీహార్ లోనూ విజృంభిస్తుంది. ఎన్నికలు జరిగే సమయానికి భారీ బహిరంగ సభలు కూడా ఉండకపోవచ్చు. ఇక వర్చువల్ ర్యాలీలు, సభలు మాత్రమే ఉండనున్నాయి. దీంతో బీహార్ ఎన్నికల్లో అన్ని పార్టీలకూ సోషల్ మీడియా, టెక్నాలజీ మాత్రమే ప్రధాన పాత్ర పోషించనుంది. అందుకే బీజేపీ ఇప్పటికే పదివేల మంది వరకూ ఐటీ హెడ్స్ ను ఒక్క బీహార్ కోసమే నియ మించింది. డిజిటల్ ప్రచారాన్ని చేసేందుకు బీజేపీ అన్ని విధాలుగా సిద్ధమయింది. మరి ప్రశాంత్ కిషోర్ కు ధీటుగా బీజేపీ ఈ ఎన్నికల్లో డిజిటల్ ప్రచారం చేసి విజయం సాధించగలదా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News