అప్పుడే ఏమయిందని…?

అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు తిరిగి పోటీ చేసేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు అధికార భారతీయ జనతా పార్టీకి ఇబ్బందులు మొదలయ్యాయి. ఉప ఎన్నికల్లో [more]

Update: 2019-11-14 17:30 GMT

అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు తిరిగి పోటీ చేసేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు అధికార భారతీయ జనతా పార్టీకి ఇబ్బందులు మొదలయ్యాయి. ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చని అత్యున్నత ధర్మాసనం తీర్పు చెప్పడంతో వారికి టిక్కెట్లు కేటాయిస్తారా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. ఫిరాయింపులు చేసిన వారికి టిక్కెట్లు ఎలా ఇస్తారని ఇటు విపక్షం నుంచి అటు స్పపక్షం నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప అభ్యర్థుల ఎంపికలో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదంటున్నారు.

పదిహేను స్థానాల్లో…..

కర్ణాటకలో వచ్చే నెల 5వ తేదీన పదిహేను అసెంబ్లీ నియోకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే ఈ ఎమ్మెల్యేల రాజీనామాతోనే యడ్యూరప్ప ప్రభుత్వం ఏర్పడింది. అందుకోసం వారికి చేయూతనందించాల్సిన ఆవశ్యకత యడ్యూరప్పపైనే ఉంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరారు.

అందరికీ ఇస్తామని….

నిన్న మొన్నటి వరకూ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండటంతో యడ్యూరప్ప కూడా అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తామని చెప్పారు. అధిష్టానం కూడా ఇందుకు అంగీకరించిందని తెలిపారు. అయితే యడ్యూరప్ప ప్రకటనతో సొంత పార్టీలో కొంత వ్యతిరేకత ఎదురయింది. గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసిన నేతలు అసంతృప్తితో ఉన్నారు. తమ స్థానాన్ని వారికి ఎలా కేటాయిస్తారని వారు ఎదురుతిరుగుతున్నారు. కొందరయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తామని హెచ్చరికలు పంపారు.

వ్యతిరేకత రావడంతో….

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత యడ్యూరప్ప అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు టిక్కెట్ల విషయంలో పూర్తి స్పష్టత ఇవ్వలేదు. కోర్ కమిటీ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు తిరిగి పోటీ చేస్తే కొంత వ్యతిరేకత వస్తుందన్ని రాష్ట్ర పార్టీ అభిప్రాయం. ఇందులో కొందరికే టిక్కెట్లు దక్కే అవకాశముందని తెలుస్తోంది. మిగిలిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. మొత్తం మీద సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కర్ణాటక బీజేపీ కొంత ఇబ్బందిలో పడినట్లే కన్పిస్తుంది.

Tags:    

Similar News