ఈయనతో బ్రదర్ కు చెక్ పెడతారట
తమిళనాడులో ఇటీవలే ఎన్నికలు ముగిశాయి. డీఎంకే అత్యధిక స్థానాలతో విజయం సాధించింది. స్టాలిన్ ముఖ్యమంత్రిగా సక్సెస్ అవుతున్నారు. మరోవైపు అన్నాడీఎంకేలో నాయకత్వ సమస్య మరింత ఎక్కువయింది. ఈ [more]
తమిళనాడులో ఇటీవలే ఎన్నికలు ముగిశాయి. డీఎంకే అత్యధిక స్థానాలతో విజయం సాధించింది. స్టాలిన్ ముఖ్యమంత్రిగా సక్సెస్ అవుతున్నారు. మరోవైపు అన్నాడీఎంకేలో నాయకత్వ సమస్య మరింత ఎక్కువయింది. ఈ [more]
తమిళనాడులో ఇటీవలే ఎన్నికలు ముగిశాయి. డీఎంకే అత్యధిక స్థానాలతో విజయం సాధించింది. స్టాలిన్ ముఖ్యమంత్రిగా సక్సెస్ అవుతున్నారు. మరోవైపు అన్నాడీఎంకేలో నాయకత్వ సమస్య మరింత ఎక్కువయింది. ఈ నేపథ్యంలో బీజేపీ తమిళనాడుపై మరింత దృష్టి పెట్టింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం సాధించడంతో ఈ రాష్ట్రంలో కాలు మోపేందుకు అవకాశాలున్నాయని భావిస్తుంది.
అన్నాడీఎంకేతో…..
పదేళ్ల పాటు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే తమకు మిత్ర పక్షంగా ఉన్నప్పటికీ ఫలితం లేదని బీజేపీ గ్రహించింది. అధికార డీఎంకే పై అన్నాడీఎంకే నేతలు చేసే ఆరోపణలకు విలువ ఉండదు. అంతేకాకుండా భవిష్యత్ లో వివిధ అవినీతి కేసుల్లో అన్నాడీఎంకే నేతలను స్టాలిన్ ఇరికించే అవకాశముంది. అంతేకాకుండా అత్యధిక పార్లమెంటు స్థానాలు డీఎంకే కు ఉన్నాయి. భవిష్యత్ లో రాజ్యసభ స్థానాలు కూడా అధికంగా దానికే వస్తాయి.
కాంగ్రెస్ తో నమ్మకంగా…..
స్టాలిన్ కాంగ్రెస్ కు నమ్మకమైన మిత్రుడుగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా పాలన విషయంలోనూ స్టాలిన్ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇది బీజేపీకి రుచించడం లేదు. స్టాలిన్ ను రాష్ట్రంలోనే కట్టడి చేయాలని నిర్ణయానికి బీజేపీ వచ్చినట్లు తెలిసింది. అదే కుటుంబం నుంచి స్టాలిన్ కు చెక్ పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా కరుణానిధి మరో కుమారుడు ఆళగిరిని పార్టీలోకి తీసుకురావాలని బీజేపీ ప్లాన్ గా ఉంది.
ఆళగిరిని తీసుకొచ్చి….
ఆళగిరి కరుణానిధి కుమారుడిగా బలమైన క్యాడర్ ఉంది. అంతేకాకుండా స్టాలిన్ ఆళగిరిని పూర్తిగా దూరం పెట్టారు. దీంతో ఆళగిరి చేతనే చెక్ పెట్టాలన్నది బీజేపీ ఆలోచన. ఆళగిరి చేత స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు చేయిస్తే దానికి కొంత నమ్మకం ఉంటుంది. ప్రజలు కూడా విశ్వసిస్తారు. అందుకే త్వరలోనే ఆళగిరికి బీజేపీ కాషాయ కండువా కప్పేందుకు సిద్ధమయింది. అవసరమయితే ఆయనకు పదవి కూడా ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తం మీద స్టాలిన్ కు చెక్ పెట్టేందుకు తమిళనాడులో ఆళగిరిని రంగంలోకి దించాలన్న బీజేపీ ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.