బావురుమంటున్నారే.. ఇక కష్టమేనట
తెలంగాణలో బలపడాలని భావిస్తున్న బీజేపీకి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇబ్బందికరంగా మారాయి. పైకి పశ్చిమ బెంగాల్ లో తమ పార్టీ ఓటు శాతం పెరిగిందని చెబుతున్నా [more]
తెలంగాణలో బలపడాలని భావిస్తున్న బీజేపీకి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇబ్బందికరంగా మారాయి. పైకి పశ్చిమ బెంగాల్ లో తమ పార్టీ ఓటు శాతం పెరిగిందని చెబుతున్నా [more]
తెలంగాణలో బలపడాలని భావిస్తున్న బీజేపీకి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇబ్బందికరంగా మారాయి. పైకి పశ్చిమ బెంగాల్ లో తమ పార్టీ ఓటు శాతం పెరిగిందని చెబుతున్నా కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి వచ్చే ఎన్నికల్లో తమను బలితీసుకుంటుందేమోనన్న ఆందోళన పార్టీలో నెలకొంది. తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశాలున్నాయి. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలుండటంతో కేంద్ర నాయకత్వం కూడా ఇక్కడ దృష్టిపెట్టింది.
బలపడేందుకు ప్రయత్నించినా…?
తొలుత కేంద్ర కేబినెట్ లోకి కిషన్ రెడ్డిని తీసుకోవడం, ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ నేపథ్యమున్న బండి సంజయ్ ను పార్టీ అధ్యక్షుడిగా నియమించడం వంటి చర్యలతో కొంత దూకుడును పెంచింది. అంతకు ముందే నాలుగు పార్లమెంటు స్థానాలను గెలుచుకోవడంతో తెలంగాణలో తమకు స్పేస్ ఉందని బీజేపీ నేతలు గుర్తించారు. అందుకోసమే ఇక్కడికి తరచూ కేంద్ర మంత్రులను పంపి పార్టీలో జోష్ నింపుతున్నారు.
సానుకూలత కన్పించినా….
దుబ్బాక ఎన్నికల్లో గెలవడంతో బీజేపీకి తెలంగాణలో మంచి ఊపు వచ్చింది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లోనూ అత్యధిక డివిజన్లు సాధించడంతో బీజేపీ మరింత స్ట్రాంగ్ అయిందని భావించారు. కానీ ఆ తర్వాత జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కమలం పార్టీ పేలవమైన ప్రదర్శన కనపర్చింది. దీంతో కొన్ని ప్రాంతాలకే బీజేపీ పరిమితమయిందని భావించాలి.
మోదీపై వ్యతిరేకత….
దీనికితోడు మోదీ ఇమేజ్ క్రమంగా తగ్గిపోతుండటం కూడా బీజేపీకి తెలంగాణలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లోనూ ఇదే కనపడింది. పెట్రోలు ధరలు పెరగడం, కరోనా విపత్తు సమయంలో రాష్ట్రాలను గాలికి వదిలేయడంతో మోదీ పై వ్యతిరేకత మొదలయిందంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో గోల్కొండ కోట మీద జెండా ఎగురవేస్తామంటున్న కమలనాధులకు ఇప్పుడు దిగులు పట్టుకుంది. పార్టీని బలోపేతం చేయాలంటే కేంద్రం సహకరించాలి. అదే కేంద్రంపైనే వ్యతిరేకత ఉండటంతో బీజేపీ నేతలు బావురుమంటున్నారు.