తిరుపతి లో జనసేన ఓట్లు బీజేపీకి దెబ్బేశాయా?

భారతీయ జనతా పార్టీ ఆశలు ఫలించలేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజలు దానికి గట్టి షాక్ ఇచ్చారు. అసలు పోటీ లోకి కూడా పరిగణనలోకి తీసుకోనట్లే కన్పించింది. [more]

Update: 2021-05-02 11:00 GMT

భారతీయ జనతా పార్టీ ఆశలు ఫలించలేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజలు దానికి గట్టి షాక్ ఇచ్చారు. అసలు పోటీ లోకి కూడా పరిగణనలోకి తీసుకోనట్లే కన్పించింది. ఆర్భాటం తప్ప బీజేపీకి జనాల్లో విషయం లేదన్నది తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల్లో స్పష్టమయింది. ఇంత దారుణ ఫలితాలు వస్తాయని ఆ పార్టీ నేతలు కూడా ఊహించి ఉండరు. కేంద్ర ప్రభుత్వం వైఖరి తిరుపతి ఉప ఎన్నిపై ప్రభావం చూపిందనే చెప్పాలి. జనసేనతో కలసి పోటీ చేయడంతో తాము ప్రభావం చూపగలమని భావించారు.

అన్నీ లెక్కలు వేసుకుని…

తిరుపతి ఉప ఎన్నికలో అభ్యర్థిగా ఆచితూచి అన్నీ లెక్కలు వేసి మాజీ ఐఏఎస్ అధికారి రత్న ప్రభను నిర్ణయించారు. ఆమె ఎంపిక కరెక్టే. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ రత్న ప్రభ వ్యక్తిత్వం, ఆమె ఇమేజ్ కంటే బీజేపీ పై వ్యతిరేకత ఎక్కువగా పనిచేసిందనే చెప్పాలి. ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడా బీజేపీ ప్రభావం చూపలేకపోయింది. హిందుత్వ నినాదాన్ని భుజాన వేసుకుని, తిరుపతి వైసీపీ అభ్యర్థి గురమూర్తి మతం, కులంపైనా, తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుందని ఎంత యాగీ చేసినా ప్రజలు ఆ వైపు చూడలేదనే చెప్పాలి.

జనసేన ఓట్లు….

ఇక్కడ ఒక విషయం అర్థమయింది ఏమిటంటే జనసేన ఓట్లు కూడా బీజేపీకి పడలేదు. జనసేన క్యాడర్ మొత్తం టీడీపీకే ఓట్లు వేసినట్లు స్పష్టంగా కనపడుతుంది. పవన్ కల్యాణ్ స్వయంగా వచ్చి ప్రచారం చేసినా తనకున్న ప్రధానమైన ఓటు బ్యాంకును బీజేపీ వైపు మరల్చుకోలేకపోయారు. ప్రధానంగా బలిజ సామాజికవర్గం ఓట్లు బీజేపీ అభ్యర్థికి పడలేదు. జనసేన అధినేత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వయంగా అదే సామాజికవర్గమయినా వారు టీడీపీ వైపు చూశారని చెప్పాలి. అందుకే కనీస ఓట్లను కూడా సాధించలేకపోయింది.

అదే ఆగ్రహమా?

దీనికి కారణం తిరుపతి ఉప ఎన్నికలో తాము పోటీ చేయడానికి జనసేన అక్కడ ప్రయత్నించింది. కానీ తొలి నుంచి జనసేన పోటీకి బీజేపీ నేతలు అడ్డుతగిలారు. పవన్ కల్యాణ్ తో చర్చించక ముందే తామే పోటీ చేస్తామని ప్రకటించడం వంటివి జనసేన పార్టీ క్యాడర్ కు ఆగ్రహాన్ని తెప్పించాయంటున్నారు. అందుకే బీజేపీకి తిరుపతి ఉప ఎన్నికలో దారుణమైన ఓటమిని చూడాల్సి వస్తుంది. టీడీపీని దాటి సెకండ్ ప్లేస్ కు వస్తామని భావించిన ఆ నేతలు కాంగ్రెస్ ను మాత్రం వెనక్కు నెట్టగలిగారు. అంతే తప్ప తిరుపతిలో బీజేపీ సాధించిందేమీ లేదు?

Tags:    

Similar News