Bjp : యోగికి కాలం అస్సలు కలసి రావడం లేదా?

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎందుకో బీజేపీకి ఎన్నికలకు ముందు అన్నీ ఇబ్బందులే ఎదురవుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలన్న గట్టి పట్టుదలతో [more]

Update: 2021-10-06 16:30 GMT

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎందుకో బీజేపీకి ఎన్నికలకు ముందు అన్నీ ఇబ్బందులే ఎదురవుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలన్న గట్టి పట్టుదలతో బీజేపీ కేంద్ర నాయకత్వం ఉంది. ఇందుకోసం అన్ని ఎత్తుగడలను వేస్తుంది. కానీ ఎందుకో కాలం కలసి రావడం లేదనే అనిపిస్తుంది. వరస సంఘటనలతో బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ లో వ్యతిరేకతను మూటగట్టుకుంటుంది.

ఎన్ని మార్పులు చేసినా…

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలను బీజేపీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ను పిలిపించుకుని మంతనాలు జరిపింది. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసింది. కేంద్ర మంత్రివర్గంలో అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ నుంచే తీసుకుంది. ఇంత చేసినా యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వంపై రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇక్కడ విపక్ష పార్టీలు నిలదొక్కుకుంటున్నాయి.

బలోపేతం అవుతూ….

ఇప్పటికే అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ రోజురోజుకూ బలోపేతం అవుతుంది. అయితే విపక్షాలు విడివిడిగా పోటీ చేయడం తమకు లాభిస్తుందని బీజేపీ అంచనా వేసుకుంటూ వచ్చింది. సర్వేలు కూడా దాదాపు ఇదే చెప్పాయి. గతంలో మాదిరి సీట్లు రాకున్నా బీజేపీ ఇక్కడ మరోసారి అధికారం వస్తుందని తేల్చాయి. కానీ పరిస్థితి రోజురోజుకూ రాజకీయంగా విపక్షాలకు ఎడ్జ్ టర్న్ అవుతుంది.

విపక్షాలకు ప్లస్ గా….

ఇటీవల జరిగిన లఖింపూర్‌ ఘటన బీజేపీకి తలవొంపులు తెచ్చేదే. ఇలాంటి సంఘటనలపై వెంటనే స్పందించాల్సిన సర్కార్ మిన్నకుండి పోవడం మైనస్ గా మారింది. ఈ ఘటనను విపక్ష నేతలు ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ లు చక్కగా ఉపయోగించుకున్నారంటున్నారు. మొత్తం మీద అసలే వ్యతిరేకతను ఎదుర్కొంటున్న యోగి ఆదిత్యానాధ్ ఇటువంటి సంఘటనలతో మరింత వెనకబడి పోతున్నారన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News