బెంగాల్ లో బీజేపీ సీన్ ఇదేనా?

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దశల వారీగా జరుగుతున్నాయి. టీఎంసీ, బీజేపీలు గెలుపు పై ప్రతి దశ ఎన్నికల్లోనూ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లో గత [more]

Update: 2021-04-16 17:30 GMT

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దశల వారీగా జరుగుతున్నాయి. టీఎంసీ, బీజేపీలు గెలుపు పై ప్రతి దశ ఎన్నికల్లోనూ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లో గత ఎన్నికల్లో మూడు స్థానాలకు బీజేపీ పరిమితమయింది. పార్లమెంటు ఎన్నికలకు వచ్చే సరికి పధ్దెనిమిది స్థానాలకు ఎగబాకింది. ఓటు శాతాన్ని కూడా బీజేపీ గణనీయంగా పెంచుకోగలిగింది. దీంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాల నుంచి ఎన్ని స్థానాలను బీజేపీ దక్కించుకుంంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

మమతపై వ్యతిరేకత……

మమత బెనర్జీ పదేళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. సహజంగా వెల్లువెత్తే ప్రజావ్యతిరేకత ను క్యాష్ చేసుకునేందుకు బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. గత పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన 18 పార్లమెంటు స్థానాలను పరిగణనలోకిత తీసుకుంటే 126 అసెంబ్లీ స్థానాలను దక్కించుకునే అవకాశముంది. అయితే మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవడానికి బీజేపీ ఇంకా ప్రయత్నిస్తుంది.

బీహార్ ఫార్ములా రివర్స్….

మోదీ, అమిత్ షాలు తరచూ పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తూ దీదీని విమర్శిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కమ్యునిస్టులు, కాంగ్రెస్ కూటమి బీజేపీ విజయావకాశాలు దెబ్బతీసే అవకాశాలు కన్పిస్తున్నాయి. బీహార్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలో కి రావడానికి కాంగ్రెస్, కమ్యునిస్టులు ఎలా ఉపయోగపడ్డారో? ఇక్కడ మాత్రం అదే పార్ములా రివర్స్ లో ఉందంటున్నారు. కమ్యునిస్టులు, కాంగ్రెస్ లు మమత వ్యతిరేక ఓటును చీల్చుకుంటే అది బీజేపీకే నష్టమని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు.

సర్వేలన్నీ….

ఇక మమత బెనర్జీ కి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముందస్తు సర్వేలు చెబుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ దాదాపు 170 నుంచి 180 స్థానాలను సాధించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీ, షాలు మరింత ఫోకస్ పెట్టారు. మమత పార్టీ నుంచి నేతలను బీజేపీ ఎక్కువ సంఖ్యలో తీసుకోవడం కూడా ఆ పార్టీకి ఇబ్బందిగా మారిందంటున్నారు. ఇలా మొత్తం మీద చూసుకుంటే బీజేపీకి పశ్చిమ బెంగాల్ లో విజయావకాశాలు తక్కువగానే వస్తున్నాయి. యాభై నుంచి 60 స్థానాలకు మించి రావన్నది ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికలను బట్టి తెలుస్తోంది.

Tags:    

Similar News