సర్టిఫికెట్ సంగతి సరే … వాటిని ఎలా సమర్ధించుకుంటారు?
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అంతా గత ప్రభుత్వ హయాంలో గోలవరం గా సాగింది. ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ దక్కించుకోవాలని భావించిన నాటి తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రం చేపట్టాలిసిన [more]
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అంతా గత ప్రభుత్వ హయాంలో గోలవరం గా సాగింది. ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ దక్కించుకోవాలని భావించిన నాటి తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రం చేపట్టాలిసిన [more]
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అంతా గత ప్రభుత్వ హయాంలో గోలవరం గా సాగింది. ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ దక్కించుకోవాలని భావించిన నాటి తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రం చేపట్టాలిసిన పని తమ నెత్తికి ఎత్తుకుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. అక్కడి నుంచి అసలు తిప్పలు మొదలయ్యాయి. టిడిపి పై నాటి విపక్షం వైసిపి నుంచి బిజెపి లోని నేతలు అంతా తినేస్తున్నారు తినేస్తున్నారంటూ చంద్రబాబు టీం పై ముప్పేట దాడి సాగించాయి. ఒకదశలో ప్రధాన విపక్షం వైసిపిని మించి మరీ బిజెపి నేతలు సోము వీర్రాజు, జివిఎల్ నరసింహ రావు ప్రాజెక్ట్ లో అవకతవకలు అంటూ విరుచుకుపడ్డారు. సాక్షాత్తు ప్రధానమంత్రి సైతం చంద్రబాబు లోకేష్ లకు పోలవరం ఎటిఎం లా మారిందని ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు తోడేస్తున్నారని తీవ్ర అభియోగాలు మోపారు.
వారికి ఆనందం … వీరికి షాక్ …
కట్ చేస్తే ఎన్నికలు వచ్చాయి. టిడిపి అధికారం కోల్పోయి విపక్షం లోకి వెళ్ళింది. దాని స్థానంలో వైసిపి అధికార పగ్గాలు చేపట్టింది. అయితే వైసిపి టిడిపి పై చేసిన ఆరోపణలపై అదే స్టాండ్ పై నిలిచిఉంది. చిత్రంగా బిజెపి స్టాండ్ మాత్రం మారింది. అదీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని జలవనరుల శాఖ పోలవరం ప్రాజెక్ట్ పనులు నిజాయితీగా నీతిగా సాగాయంటూ సర్టిఫికెట్ ఇచ్చేసింది. ఇది ఇప్పుడు వైసిపి, ఎపి బిజెపి లకు షాక్ ఇస్తే టిడిపి లో ఆనందాన్ని నింపింది. దీన్ని ఎలా ఇప్పుడు సమర్ధించుకోవాలో తెలియక ఎపి కమలనాధులు కిందా మీదా పడుతున్నారు. జగన్ సర్కార్ అయితే జలవనరుల శాఖ స్టేట్ మెంట్ పై ఇంకా తేరుకోలేదు. ఈ ప్రస్తావనే రాకుండా జాగ్రత్త పడుతుంది.
అందుకే ఇచ్చారా …?
ఇందులో చంద్రబాబు టీం లాబీయింగ్ చేసింది ఏమీ లేదు. పోలవరం ప్రాజెక్ట్ పనులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నా కేంద్ర జలవనరుల శాఖ పర్యవేక్షణలో పోలవరం అధారిటీ చేపట్టింది. ఇప్పుడు ప్రాజెక్ట్ లో అవకతవకలు నిజమే అని అంగీకరించి విచారణ జరిపితే కేంద్రం కూడా దోషి అవుతుంది. ఇప్పుడు ఈ వ్యవహారంపై సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు సుప్రీం కోర్ట్ లో కేసు వేశారు. ఆ కేసు లో కేంద్రం ఇరుక్కోకుండా ఉండాలంటే ఎలాంటి గోల్ మాల్ లేదంటే అంతా హ్యాపీ.
వివాదానికి తెరదించాలని….
ఇలా చేయడం వల్ల టిడిపి కి అదనంగా వచ్చే లాభ నష్టాలు ప్రస్తుతం కేంద్ర సర్కార్ కి అనవసరం. దాంతో ఈవిధమైన ప్రకటన ఇచ్చి మొత్తం వివాదానికి తెరదించేసింది అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో ముందుకు వెళ్లడం తప్ప పాత గొడవలు వైసిపి తవ్వి తీయడానికి పెద్దగా ఏమీ లేదు. అయితే ఏపీ బిజెపి చేసిన ఆరోపణలు గాలి మాటలుగా, నీటి రాతలుగా గోదావరిలో కలిసిపోయాయి. వారే దీనికి జవాబు చెప్పాలి మరి.