బీజేపీ రాజకీయ అవసరం కోసం ఏదైనా?

భారతీయ జనతా పార్టీకి రాజకీయ అవసరం ముఖ్యం. సిద్ధాంతాలు, పార్టీ నిబంధనలను రాజకీయ అవసరాల కోసం గాలికి వదిలేస్తుంది. ఇది పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మరోసారి రుజువయింది. [more]

Update: 2021-04-24 18:29 GMT

భారతీయ జనతా పార్టీకి రాజకీయ అవసరం ముఖ్యం. సిద్ధాంతాలు, పార్టీ నిబంధనలను రాజకీయ అవసరాల కోసం గాలికి వదిలేస్తుంది. ఇది పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మరోసారి రుజువయింది. బీజేపీలో 70ఏళ్లు వయసు దాటితే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంగకరించరు. ఎల్. కె. అద్వానీ, మురళి మనోహర్ జోషి, సుమిత్ర మహాజన్, ఉమా భారతి వంటి నేతలను పార్టీ ఈ కారణంగానే పక్కన పెట్టింది. కానీ కేరళలో మెట్రో శ్రీధరన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.

సింగూరు నుంచి….

పశ్చిమ బెంగాల్ విషయానికొస్తే ఇక్కడ మమత బెనర్జీ ని దెబ్బతీసేందుకు టీఎంసీ ఎమ్మెల్యేలను, ఎంపీలను బీజేపీ ఆకర్షించింది. అవసరమున్న లేకపోయినా పార్టీలో చేర్చుకుని టిక్కెట్లను ఇచ్చింది. పార్టీ నిబంధనలకు ఇది పూర్తిగా విరుద్ధమని అభిప్రాయం వ్యక్తమవుతున్నా గెలుపే ముఖ్యంగా బీజేపీ అధినాయకత్వం టిక్కెట్లను పంపినీ చేసింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ సింగూరు అసెంబ్లీ నియోజకవర్గం.

88 ఏళ్ల వయసులో…..

సింగూరు అసెంబ్లీ నియోజవర్గానికి రవీంద్రనాధ్ భట్టాచార్య తృణమూల్ కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించేవారు. ఆయన నాలుగుసార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రవీంద్రనాధ్ భట్టాచార్య వయసు 88 ఏళ్లు. దీంతో వయసు రీత్యా టిక్కెట్ ఇచ్చేందుకు మమత బెనర్జీ నిరాకరించింది. దీంతో ఆయన బీజేపీలో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు. 88 ఏళ్ల వయసులో మరోసారి గెలిచేందుకు ఆయన పోరాటం చేస్తున్నారు.

గెలవడం కోసమే?

నిజానికి 88 ఏళ్ల వయసున్న వ్యక్తికి బీజేపీలో టిక్కెట్ ఇచ్చే సంస్కృతి లేదు. కానీ రాజకీయ అవసరాల దృష్ట్యానే రవీంద్ర నాధ్ భట్టాచార్యను బీజేపీ రంగంలోకి దించింది. టీఎంసీ ఇక్కడ బేచారం మన్నాను బరిలోకి దించింది. ఇక్కడ రవీంద్రనాధ్ భట్టాచర్యకు పట్టు ఉండటంతో ఈ సీటును ఎలాగైనా దక్కించుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ ఆయనను రంగంలోకి దించింది. దీంతో బీజేపీకి రాజకీయ అవసరాలే తప్ప నిబంధనలను పట్టించుకోదన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News