ఫిరాయింపుదారులకు పట్టం కడతారా?
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఈసారి గెలుపోటములపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రధాన పోటీ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్యనే ఉండటంతో ఎవరిది గెలపు అన్నది ఖచ్చితంగా [more]
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఈసారి గెలుపోటములపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రధాన పోటీ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్యనే ఉండటంతో ఎవరిది గెలపు అన్నది ఖచ్చితంగా [more]
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఈసారి గెలుపోటములపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రధాన పోటీ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్యనే ఉండటంతో ఎవరిది గెలపు అన్నది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే ఈ ఎన్నికల్లో ప్రధాన అంశం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ తాను బలపడేందుకు చేసిన వ్యూహం వికటిస్తుందా? సత్ఫలితాలనిస్తుందా? అన్నది చూడాల్సి ఉంది. నేతలు మారినంత మాత్రాన పార్టీ బలోపేతం అవుతుందా? అన్నది కూడా చర్చనీయాంశమే.
మూడేళ్ల ముందు నుంచే….
పశ్చిమ బెంగాల్ పై బీజేపీ ఎన్నికలకు మూడేళ్ల ముందే దృష్టి పెట్టింది. 2019 ఎన్నికల్లో బీజేపీ 18 పార్లమెంటు స్థానాలను దక్కించుకుని బలం పెంచుకుంది. ఆ లెక్క ప్రకారం చూస్తే దాదాపు 121 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ బలంగా ఉన్నట్లే. ఓట్ల శాతం కూడా 40 వరకూ ఉంది. దీంతో బీజేపీ పశ్చిమ బెంగాల్ లో పాగా వేసేందుకు పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించింది.
రెండు విధాలుగా…
అనేక మంది మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యమైన నేతలను బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ నుంచి లాగేసుకుంది. ఆ నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్నవారిని ఎవరినీ బీజేపీ వదలిపెట్టలేదు. ఇది బీజేపీకి రెండు విధాలుగా లాభించిందంటున్నారు. ఒకటి ఆయా నియోజకవర్గాల్లో బలం పెంచుకోవడం కాగా, మరోకొటి మమత బెనర్జీ ని మానసికంగా దెబ్బతీయడం. రెండో విషయంలో బీజేపీ సక్సెస్ అయినట్లు కన్పించినా, మొదటి విషయంలో మాత్రం డౌటే.
ప్రజలు ఆదరిస్తారా?
ఎందుకంటే టీఎంసీ నుంచి పార్టీలో చేరిన వారికి టిక్కెట్లు ఇవ్వక తప్పిందికాదు. వీరిలో చాలా మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి మరోసారి పార్టీ మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిని ప్రజలు ఎంతవరకూ ఆదరిస్తారన్న సందేహం బీజేపీని వెంటాడుతూనే ఉంది. గతంలో ఇతర రాష్ట్రాల్లో ఈ అనుభవాలు వర్క్ అవుట్ కాలేదు. మరి పశ్చిమ బెంగాల్ ప్రజలు పార్టీ మారిన వారిని ఆదరిస్తారా? లేదా? అన్నది తెలియాలంటే మే 2వ తేదీ వరకూ ఆగాల్సిందే.