Bhumana : ఈ సారి భూమనకు నో ఛాన్స్…. పెద్దల సభకేనట
ఇప్పడు మంత్రి వర్గ సమావేశంలో ఎవరికి పదవి దక్కుతుందా? అన్న టెన్షన్ ఒకవైపు ఉండగా, మరోవైపు ఈసారి ఎన్నికల్లో టిక్కెట్లు గల్లంతయ్యే వారిపై కూడా చర్చ జరుగుతోంది. [more]
ఇప్పడు మంత్రి వర్గ సమావేశంలో ఎవరికి పదవి దక్కుతుందా? అన్న టెన్షన్ ఒకవైపు ఉండగా, మరోవైపు ఈసారి ఎన్నికల్లో టిక్కెట్లు గల్లంతయ్యే వారిపై కూడా చర్చ జరుగుతోంది. [more]
ఇప్పడు మంత్రి వర్గ సమావేశంలో ఎవరికి పదవి దక్కుతుందా? అన్న టెన్షన్ ఒకవైపు ఉండగా, మరోవైపు ఈసారి ఎన్నికల్లో టిక్కెట్లు గల్లంతయ్యే వారిపై కూడా చర్చ జరుగుతోంది. అందులో భూమన కరుణాకర్ రెడ్డి ఒకరు. ఈసారి భూమన ను పక్కన పెట్టే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆయన సీటుకు ఎసరు పెట్టేలా కన్పిస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లోనే ఇవే తన చివరి ఎన్నికలు అని భూమన ఎప్పుడో చెప్పారు.
వారసుడిని….
అయితే భూమన కరుణాకర్ రెడ్డి తన వారసుడిని ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. కానీ జగన్ మాత్రం ఇందుకు నో చెప్పినట్లు తెలిసింది. ఇందుకు తిరుపతిలో ఉన్న ప్రత్యేక కారణాలేనని చెబుతున్నారు. ఏపీలో కాపు, కమ్మ ఈక్వేషన్లతో టీడీపీ, జనసేన ఎన్నికల బరిలోకి దిగే అవకాశముంది. అందుకే తిరుపతి నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం నేతనే ఈసారి ఎన్నికల బరిలోకి జగన్ దించే అవకాశాలున్నాయి.
కాపు సామాజికవర్గం నేతలకు……
ఈ విషయాన్ని ఇప్పటికే భూమన కరుణాకర్ రెడ్డికి స్పషం చేసినట్లు తెలిసింది. తిరుపతిలో బలిజ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అక్కడ వారే గెలుపోటములను నిర్ణయిస్తారు. మెగాస్టార్ చిరంజీవి, చదలవాడ కృష్ణమూర్తి, వెంకటరమణ, సుగుణ వీరంతా తిరుపతి నుంచి గెలిచిన కాపు సామాజికవర్గం చెందిన వారే. భూమన కరుణాకరెడ్డి, ఎన్టీ రామారావు వంటి వారు కూడా ఇక్కడ నుంచి గెలిచారు.
గత ఎన్నికల్లోనూ…
అయితే ఈసారి టీడీపీ, జనసేన కలుస్తుండటంతో ఇక్కడ కాపు సామాజికవర్గానికి చెందని అభ్యర్థి అయితే బాగుంటుందని జగన్ డిసైడ్ అయ్యారు. గత ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థి పై భూమన కరుణాకర్ రెడ్డి 700 ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారు. అందుకే ఈసారి ఆ రిస్క్ తీసుకోదలచుకోలేదంటున్నారు. భూమన కరుణాకర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కాపు సామాజికవర్గానికి చెందిన వారికే తిరుపతి టిక్కెట్ ను ఈసారి ఖరారు చేయనున్నారు.