బీహర్ లో బీజేపీకి అడ్వాంటేజీయేనా?

బీహర్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. మొదటిదశ పోలింగ్ ముగిసింది. అయితే కోవిడ్ కారణంగా ఓటర్లు పెద్దగా పోలింగ్ కేంద్రాలకు తరలి రాకపోవడంపై రాజకీయ పార్టీల్లో ఆందోళన మొదలయింది. [more]

Update: 2020-11-06 17:30 GMT

బీహర్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. మొదటిదశ పోలింగ్ ముగిసింది. అయితే కోవిడ్ కారణంగా ఓటర్లు పెద్దగా పోలింగ్ కేంద్రాలకు తరలి రాకపోవడంపై రాజకీయ పార్టీల్లో ఆందోళన మొదలయింది. తొలిదశ బీహార్ ఎన్నికల్లో మొత్తం 71 శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. అయితే కేవలం 55.69 శాతం మాత్రమే పోలింగ్ నమోదయింది. ఇది అధికార పార్టీలో కొంత ఆనందం నింపుతుండగా, విపక్షాల్లో మాత్రం గాభరా మొదలయింది.

తక్కువ శాతం…?

అయితే 2015 శాసనసభ ఎన్నికల్లోనూ ఇదే నియోజకవర్గాల్లో 54.94 శాతం పోలింగ్ మాత్రమే నమోదయిందని, దీంతో పోల్చుకుంటే ఈసారి పెరిగిందని విపక్షాలు అంటున్నాయి. మొత్తం 16 జిల్లాల్లో జరిగిన తొలి దశ పోలింగ్ లో కోవిడ్ నియంత్రణ కోసం కట్టుదిట్ట మైన ఏర్పాట్లు చేసినప్పటికీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి రాలేదు. అనేక చోట్ల పార్టీ నేతలు ఓటర్లను తరలించడానికి చేసిన ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు.

పోలింగ్ తక్కువగా ఉంటే?

సహజంగా పోలింగ్ శాతం తక్కువగా ఉంటే అధికార పార్టీకి అడ్వాంటేజీ ఉంటుందని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నారు. అధికార పార్టీ పై ఉన్న వ్యతిరేకత పోలింగ్ శాతం తక్కువగా ఉండటంతో ప్రభావం చూపదంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పోల్ కాకుంటే అధికార పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని, బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏకు పోలింగ్ శాతం తగ్గడం అడ్వాంటేజీగా మారనుందని విశ్లేషకులు సయితం అంచనా వేస్తున్నారు.

పోలింగ్ కేంద్రాలకు….

ఇప్పటికే సర్వేలన్నీ ఎన్డీఏ వైపు మొగ్గు చూపాయి. బీహార్ లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. తొలిదశలో పోలింగ్ శాతం తగ్గడంతో మలి విడత పోలింగ్ శాతం పెరిగేలా చూడాలని విపక్షాలు తమ పార్టీ క్యాడర్ ను ఆదేశించాయి. నితీష్ కుమార్ ను ఇంటికి పంపాలంటే పోలింగ్ కేంద్రాలకు తరలి రావాలని మహాకూటమి నేతలు ప్రచారంలో పిలుపునిస్తున్నారు. అయితే కోవిడ్ కారణంగానే ఓటర్లు ఓట్లు వేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది.

Tags:    

Similar News