ఈ రెడ్డిగారికి ఆ రెడ్డిగారు చెక్ పెట్టారట

మంత్రి పెద్దిరెడ్డి క‌నుస‌న్నల్లో నిన్న మొన్నటి వ‌ర‌కు మెలిగిన శ్రీకాళ‌హ‌స్తి ఎమ్మెల్యే బియ్యపు మ‌ధుసూద‌న్ రెడ్డి పెద్దిరెడ్డి ముందే త‌లాడిస్తున్నార‌ట‌. చిత్తూరు జిల్లాలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌. [more]

Update: 2020-12-12 02:00 GMT

మంత్రి పెద్దిరెడ్డి క‌నుస‌న్నల్లో నిన్న మొన్నటి వ‌ర‌కు మెలిగిన శ్రీకాళ‌హ‌స్తి ఎమ్మెల్యే బియ్యపు మ‌ధుసూద‌న్ రెడ్డి పెద్దిరెడ్డి ముందే త‌లాడిస్తున్నార‌ట‌. చిత్తూరు జిల్లాలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌. ఇటీవ‌ల కాలంలో ముఖ్యంగా క‌రోనా త‌ర్వాత త‌న సొంత ఇమేజ్‌ను పెంచుకునేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని రైస్ మిల్లర్లను పోగు చేసి.. వారి నుంచి వెయ్యి క్వింటాళ్ల బియ్యాన్ని సేక‌రించి పేద‌ల‌కు పంచే కార్యక్రమాన్ని అప్పట్లో వంద లారీల్లో నిర్వహించి వివాదాస్పద‌మ‌య్యారు. ఇది రాజ‌కీయంగా పెను వివాదానికి దారితీసింది. దీంతో స్వయంగా పెద్దిరెడ్డి ఆయన‌ను హెచ్చరించారు. ఇలాంటి కార్యక్రమాలు వ‌ద్దని.. ఏదైనా ఉంటే త‌న దృష్టికి తీసుకురావాల‌ని సూచించారు.

అన్నీ వివాదాలే…..

ఆ త‌ర్వాత కూడా శ్రీకాళ‌హ‌స్తి అభివృద్ది ప‌నుల విష‌యంలో పెద్దిరెడ్డి జోక్యాన్ని బియ్యపు మ‌ధుసూద‌న్ రెడ్డి స‌హించ‌లేద‌ట‌. ఆ త‌ర్వాత కూడా ఒక‌టి రెండు సార్లు మ‌ధుసూద‌న్ పెద్దిరెడ్డి మాట‌ల‌ను పెడ‌చెవిన పెట్టారని చిత్తూరు టాక్‌. బియ్యం పంపిణీ ఒకర‌కంగా వివాద‌మైనా.. మ‌రోర‌కంగా ఎమ్మెల్యే మ‌ధుసూద‌న్‌కు మంచి గుర్తింపు తీసుకువ‌చ్చింది. అనేక మీడియాల్లో చ‌ర్చలు జ‌రిగాయి. ఆయ‌న కూడా వాటిలో పాల్గొన్నారు. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు ప్రత్నామ్నాయ‌మే లేద‌నేంతగా ఆయ‌న ఎదిగిపోయారు. క‌ట్ చేస్తే ఇటీవ‌ల కూడా జ‌గ‌న్ ప్రజాసంక‌ల్ప పాద‌యాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భాన్ని పుర‌స్కరించుకుని భారీ ఎత్తున ర్యాలీ చేశారు. ఇది కూడా వివాద‌మైంది.

పార్టీ కోసమే చేస్తున్నానని….

ఇది జిల్లాలోనే ధూం ధాం అయ్యింది. దీనికి కూడా మంత్రికి స‌మాచారం లేదు. దీంతో పెద్దిరెడ్డి ఆగ్రహం క‌ట్టలు తెంచుకుంద‌ని అక్కడ వైసీపీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. దీంతో ఆయ‌న ఏకంగా ఎమ్మెల్యేపై సీఎం జ‌గ‌న్‌కు ఫిర్యాదులు మోశారు. ఆయ‌న మ‌న మాట విన‌డం లేదు. ఇలా అయితే క‌ష్టమేన‌ని సీఎం ద‌గ్గర చెప్పిన‌ట్టు తెలిసింది. ఇదే విష‌యం ఎమ్మెల్యే బియ్యపు మ‌ధుసూద‌న్ రెడ్డికి సీఎంవో వ‌ర్గాల నుంచి స‌మాచారం అందింది. దూకుడు త‌గ్గించాల‌ని కూడా సూచించారట‌. అయితే.. తాను ఏం చేసినా.. పార్టీ కోసం చేస్తున్నాన‌ని. ఎవ‌రికి ఇవ్వాల్సింది వారికి ఇస్తున్నాన‌ని వ్యాఖ్యలు చేశార‌ట‌.

చెక్ పెట్టేందుకు….

ఇది మ‌రింత వివాదానికి కార‌ణ‌మైంది. దీంతో నేరుగా జోక్యం చేసుకున్న పెద్దిరెడ్డి.. ఇక్కడ వైసీపీకి అనుకూలంగా ఉండే వారిని చేర‌దీసేందుకు పావులు క‌దుపుతున్నార‌ని అంటున్నారు. వైసీపీకి అంటే.. ప‌రోక్షంగా త‌న‌కు అనుకూలంగా ఉండేవారు ఉంటే చూడాల‌ని స్థానికంగా త‌న‌కు అనుకూలంగా ఉన్నవార‌ని ఆదేశించిన‌ట్టు నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ సాగుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి టీడీపీ సీనియ‌ర్ నేత‌.. బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డిని పార్టీలోకి తీసుకునేందుకు మంత్రాంగం జ‌రుగుతోంద‌ని అంటున్నారు. బియ్యపు మ‌ధుసూద‌న్ రెడ్డి దూకుడు ఎలా ఉన్నా చిత్తూరు జిల్లాలోనే కాకుండా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పెద్దిరెడ్డి దూకుడుపై సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక చిత్తూరులోనే రోజా లాంటి వాళ్లు పైకి చెప్పుకుని బాధ‌ప‌డుతున్నా.. లోలోప‌ల ర‌గులుతున్న వారు చాలా మందే ఉన్నారు.

Tags:    

Similar News