దిగితే దగా పడక తప్పదా?
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక పై బీజేపీ, జనసేన పార్టీల్లో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ ఉప ఎన్నికను జనసేనకు వదిలివేయాలని రాష్ట్ర బీజేపీ నేతలు [more]
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక పై బీజేపీ, జనసేన పార్టీల్లో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ ఉప ఎన్నికను జనసేనకు వదిలివేయాలని రాష్ట్ర బీజేపీ నేతలు [more]
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక పై బీజేపీ, జనసేన పార్టీల్లో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ ఉప ఎన్నికను జనసేనకు వదిలివేయాలని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తిరుపతి ఉప ఎన్నికలో జనసేన అభ్యర్థి పోటీ చేసే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఇప్పుడు ఏపీ బీజేపీపై అధినాయకత్వం నుంచి వత్తిడి ఎక్కువగా ఉంది. తెలంగాణ బీజేపీతో ఏపీ బీజేపీని అధినాయకత్వం పోల్చి చూస్తోంది.
వత్తిడి తీవ్రమవుతుండటంతో…
తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలలో విజయం, గ్రేటర్ హైదరాబాద్ లో అధిక స్థానాలను కైవసం చేసుకోవడంతో బండి సంజయ్ గ్రాఫ్ అధినాయకత్వం వద్ద పెరిగింది. ఏపీలో అదే సీన్ రావాలని అధినాయకత్వం భావిస్తుంది. ఏపీలో జరగునున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో గెలిచి తీరాలని అధినాయకత్వం భావిస్తుంది. కానీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బీజేపీ బలంగా లేదు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ దక్కలేదు.
బలం శూన్యమే…..
జనసేన అయినా ఈ పార్లమెంటు పరిధిలో బలంగా ఉందా? అంటే అది కూడా కన్పించడం లేదు. కేవలం కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఆ పార్టీకి క్యాడర్ కన్పిస్తుంది. గెలవలేని సీటును తీసుకుని అధినాయకత్వం వద్ద చెడ్డపేరు తెచ్చుకోవడం ఎందుకన్న ధోరణిలో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఉన్నారు. ఇటీవల సోము వీర్రాజుకు అత్యంత సన్నిహితుడైన విష్ణు వర్థన్ రెడ్డి తిరుపతి ప్రాంతాల్లో పర్యటిస్తూ ముఖ్యనేతల అభిప్రాయాలను సేకరించనట్లు తెలిసింది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో గెలుపు అసాధ్యమని నేతలు చెప్పడంతో ఈ సీటును జనసేనకే వదిలేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
జనసేన అడుగుతుండటంతో…..
మరోవైపు పవన్ కల్యాణ్ కూడా తమకు ఈ టిక్కెట్ కావాలని పట్టుబడుతున్నారు. గతంలో ప్రజారాజ్యం తిరుపతి శాసనసభలో గెలిచిన విషయాన్ని జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరుల్లో తమకు బలం ఉందని జనసేన నేతలు ఇప్పటికే నివేదిక రూపంలో బీజేపీ అధిష్టానానికి అందించినట్లు తెలిసింది. తాము బరిలో ఉండదనుకుంటున్న రాష్ట్ర బీజేపీ నేతలకు పవన్ డిమాండ్ కలసి వచ్చినట్లయిందంటున్నారు. అందుకే జనసేనకే వదిలేయాలని బీజేపీ భావిస్తుంది. మరి చివరకు ఎలాంటి నిర్ణయం వస్తుందో చూడాలి.