ఆళగిరిని అలా వాడుకుంటారట

తమిళనాడు ఎన్నికలకు సమయం దగ్గరపడింది. ఇప్పటికే కూటములు రెడీ అయిపోతున్నాయి. అన్నాడీఎంకే, బీజేపీ కూటమి ఖరారయింది. సీట్ల సర్దుబాటు కూడా ఒక కొలిక్కి వచ్చింది. డీఎంకే కూడా [more]

Update: 2020-12-05 18:29 GMT

తమిళనాడు ఎన్నికలకు సమయం దగ్గరపడింది. ఇప్పటికే కూటములు రెడీ అయిపోతున్నాయి. అన్నాడీఎంకే, బీజేపీ కూటమి ఖరారయింది. సీట్ల సర్దుబాటు కూడా ఒక కొలిక్కి వచ్చింది. డీఎంకే కూడా కాంగ్రెస్ తో కలసి చిన్నా చితకా పార్టీలను కలుపుకుని ముందుకు వెళుతుంది. ఈనేపథ్యంలో బీజేపీ తమిళనాడులో భారీ స్కెచ్ వేసింది. రజనీకాంత్ ను, ఆళగిరిని తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.

నేరుగా కలవకపోయినా…..

ఇటీవల చెన్నై వచ్చిన అమిత్ షా నేరుగా ఆళగిరిని కలవకపోయినా ఆయన సన్నిహితులతో మాట్లాడారంటున్నారు. ఆళగిరిని ఎలాగైనా బీజేపీ కూటమిలోకి తీసుకురావాలని బీజేపీ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుంది. ఆళగిరికి మధురై ప్రాంతంలో మంచి పట్టుంది. ఆయన ఆ ప్రాంత నేతగానే ముద్రపడ్డారు. దీంతో డీఎంకే కూటమిని నిలువరించడానికి ఆళగిరిని దువ్వే ప్రయత్నాలను బీజేపీ చేస్తుంది. ఆళగిరి నేరుగా బీజేపీలో చేరకపోయినా ఆయన సొంత పార్టీ పెట్టుకుని తమతో కలవవొచ్చన్న సంకేతాలను పంపింది.

ప్రత్యామ్నాయం లేదు….

ఆళగిరికి ఇప్పుడు వేరే ప్రత్యమ్నాయం లేదు. డీఎంకే లోకి వెళ్లలేరు. రానివ్వరు కూడా. సొంత పార్టీ పెట్టినా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపగలిగిన సత్తా ఆళగిరికి లేదు. అందుకే ఆయన కూటమిలో చేరక తప్పదు. డీఎంకే పోటీ చేసే స్థానాల్లో ఆళగిరిని పోటీకి దింపే ప్రయత్నం చేస్తుంది. ఇది బీహార్ ఫార్ములా. అక్కడ లోక్ జనశక్తి పార్టీని ఇలాగే బీజేపీ ఓట్ల చీలికకు ఉపయోగించుకుంది. అదే ప్రయోగాన్ని తమిళనాడులో చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

కూటమిలో చేరకుండా…..

బీజేపీ కూటమిలో చేరడానికి ఆళగిరికి ఉన్న ఒకే ఒక ఇబ్బంది అన్నాడీఎంకే. తన తండ్రి కరుణానిధి వ్యతిరేకించిన అన్నాడీఎంకే కూటమిలో చేరితే ప్రజలు కూడా హర్షించరు. అందుకే ఆళగిరి చేత సొంత పార్టీ పెట్టించి ఆయనను డీఎంకేపై అస్త్రంగా వదలాలని బీజేపీ భావిస్తుంది. ఆళగిరికి ఉన్న పట్టుపై కూడా బీజేపీ అగ్రనేతలు ఇప్పటికే ఆరా తీశారు. తమిళనాడు ఎన్నికలు ముగిసిన తర్వాత ఆళగిరిని కేంద్ర ప్రభుత్వంలో మంచి పదవి ఇచ్చే అవకాశముందని కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద ఆళగిరిని అలా ఉపయోగించుకోవాలని బీజేపీ డిసైడ్ అయింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News