ఆ రోజుతో బీజేపీ ఎమ్మెల్యే జాతకం తేలిపోతుందట.

విశాఖ అర్బన్ జిల్లాలో బీజేపీకి ఏకైక ఎమ్మెల్యేగా ఉత్తర నియోజకవర్గం నుంచి విష్ణుకుమార్ రాజు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా చేస్తే ఏ పార్టీ [more]

Update: 2019-02-09 09:30 GMT

విశాఖ అర్బన్ జిల్లాలో బీజేపీకి ఏకైక ఎమ్మెల్యేగా ఉత్తర నియోజకవర్గం నుంచి విష్ణుకుమార్ రాజు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా చేస్తే ఏ పార్టీ తరఫున చేస్తారన్నది ఇపుడు ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. తొలిసారి అనూహ్యంగా సీటు తెచ్చుకోవడమే కాదు, బీజేపీ, టీడీపీ పొత్తు, మోడీ వేవ్ వంటి కారణాల వల్ల విష్ణు మంచి మెజారిటీతో గెలిచారు. అంతే కాదు. ఆయన బీజేపీ శాసనసభా పక్ష నాయకుడుగా కూడా ఉన్నారు. దీంతో ఒక్కసారిగా ఆయన రాష్ట్ర స్థాయి ఫిగర్ అయిపోయారు. టీడీపీతో పొత్తు పెటాకులు కావడంతో అందరి మాదిరిగానే విష్ణు కూడా పక్క చూపులు చూస్తున్నారని టాక్ నడుతోంది.

ఆ రోజు కీలకం :

ఇక ఎన్నికలకు అట్టే దూరం లేకపోవడం అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్ధులను ఎంపిక చేసే పనిలో బిజీ కావడంతో ముందే వెళ్లకపోతే అన్ని డోర్లు క్లోజ్ అవుతాయని విష్ణు లాంటి నాయకునికి బాగా తెలుసు. పైగా అసెంబ్లీ సెషన్స్ కూడా అయిపోయాయి. దీంతో ఇక ఎమ్మెల్యే పదవి అన్నది నామమాత్రమే. దాంతో విష్ణు తన నిర్ణయం ప్రకటించడానికి ఓ ముహూర్తాన్ని ఎంచుకున్నారట. అదేంటంటే విశాఖకు ప్రధాని మోడీ ఈ నెల 16న వస్తున్నారు. ఆ రోజున ఆయన సభలో విశాఖ రైల్వే జోన్ గురించి భారీ ప్రకటన చేస్తారని ఓ వైపు బీజేపీ ఊదరగొడుతోంది. అదే కనుక జరిగితే మరో మారు ఆ పార్టీ నుంచే పోటీకి విష్ణు రెడీ అవుతారట. విశాఖ వాసుల చిర కాల కోరిక తీర్చిన పార్టీగా అర్బన్ ప్రజానీకం మద్దతు తనకు ఉంటుందని విష్ణు ఆశిస్తున్నారు. పైగా తాను ఉత్తర నియోజకవర్గానికి చేసిన మంచి పనులు, అవినీతి లేని వ్యక్తిత్వం కలసి తనకే మళ్ళీ పట్టం కడతాయని కూడా ఆయన భావిస్తున్నారుట. అలా కనుక మోడీ ప్రకటించకపోతే మాత్రం పార్టీ మారడం ఖాయమని విష్ణు సన్నిహిత వర్గాల సమాచారం.

ఏ పార్టీలోకి :

ఇక విష్ణు పార్టీ ఫిరాయిస్తే ఏ పార్టీలోకి చేరుతారన్నది కూడా ఇక్కడ ఆసక్తికరమే. ఆయన టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. అదే సమయంలో వైసీపీకి కూడా దగ్గరగా ఉన్నారు. తనకు అన్ని పార్టీల్లో మిత్రులు ఉన్నారని విష్ణు చెప్పుకుంటున్నారు. ఇక టీడీపీలో నాలుగేళ్ల కాలంలో విష్ణు ఎపుడూ పొగిడారే తప్ప విమర్శల జోలికి పోలేదు. ఇపుడు కూడా అయన బాబు పట్ల అనుకూలంగానే ఉంటున్నారన్న కామెంట్స్ ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే టికెట్ విష్ణుకి బాబు ఇవ్వొచ్చు అన్న వూహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఆయనకు విజయనగరం రాజావారు పూసపాటి అశోక్ గజపతి వారి మద్దతు కూడా ఉందని అంటున్నరు. అదే సమయంలో విష్ణుకి టీడీపీ టికెట్ ఏ కారణంగానైనా ఇవ్వలేకపోతే వైసీపీ ఆప్షన్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారట. కర్నూల్ కి చెందిన ఎమ్మెల్యే, జగన్ కి సన్నిహితుడైన బుగ్గన రాజేంద్ర ప్రసాద్ తో దోస్తీ ఉందని, దాని వల్ల ఫ్యాన్ పార్టీలో బెర్త్ ఖాయమని విష్ణు ధీమాగా ఉన్నారట. మొత్తానికి రాజు గారు పక్కా ప్లాన్ తో ముందుకుళ్తున్నారని అంటున్నారు.

Tags:    

Similar News