సాధ్యమవుతుందా…?

గోదావరిలో బోటు ప్రమాదం జరిగి 35 రోజులు దాటుతుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 38 మృతదేహాలు బయటపడితే మరో 13 మంది జాడ తెలియరాలేదు. 26 మంది [more]

Update: 2019-10-21 09:30 GMT

గోదావరిలో బోటు ప్రమాదం జరిగి 35 రోజులు దాటుతుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 38 మృతదేహాలు బయటపడితే మరో 13 మంది జాడ తెలియరాలేదు. 26 మంది సురక్షితంగా నాడు బయటపడ్డారు. గల్లంతయిన వారి సంఖ్యలో సైతం కొంత స్ఫష్టత లేదు. ఆ తరువాత ఈ బోటు బయటకు తీయాలంటూ సర్వత్రా వచ్చిన నేపథ్యంలో సర్కార్ కాకినాడ బాలాజీ మెరైన్స్ కు చెందిన ధర్మాడి సత్యం బృందానికి కాంట్రాక్ట్ అప్పగించింది.

తొలి ప్రయత్నం విఫలం ….

ధర్మాడి బృందం ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతం నుంచిటును వెలికితీసే ప్రయత్నంలో విఫలమైంది. భారీ యంత్ర సామాగ్రితో రంగంలోకి దిగినా బోటు చిక్కినట్లే చిక్కి బయటపడలేదు. గోదావరిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటం, 250 అడుగుల లోతున సుడిగుండాలు వుండే ప్రవాహం, దీనికి తోడు భారీ వర్షాలు సత్యం బృందానికి ప్రతికూల పరిస్థితులను సృష్ట్టించాయి. ఈ నేపథ్యంలో వరద తగ్గుముఖం పెట్టేవరకు ఓపిక పట్టాలని బృందం వెనుతిరిగింది.

రెండో ప్రయత్నంలో వచ్చిన రెయిలింగ్ …

గోదావరి వరద తగ్గుముఖం పట్టిన వెంటనే సత్యం టీం రెండోసారి కచ్చులూరు చేరుకొని ప్రయత్నం మొదలు పెట్టింది. నీరు తగ్గడంతో 50 నుంచి 70 అడుగుల లోతున బోటు ఆచూకీ లభించింది. దాంతో ఈసారి ప్రయత్నంలో బోటు రావడం ఖాయమనే టీం భావించింది. యాంకర్ లను ప్రమాదం జరిగిన చోట దింపింది. బలంగా కొక్కేలకు బోటు చిక్కడంతో సత్యం టీం ప్రోక్రెయినర్ సహాయంతో లాగింది. అయితే కొంత దూరం వరకు బోటు వచ్చి దాని రెయిలింగ్ విరిగిపోవడంతో తిరిగి మునిగిపోయింది.

సీన్ లోకి డైవర్లు …

విశాఖకు చెందిన నిపుణులైన డైవర్లు తాజాగా రంగంలోకి దిగారు. ఆక్సిజన్ మాస్క్ లు ధరించి ప్రమాదం జరిగిన ప్రాంతంలో నీటి అడుగున బోటును గుర్తించారు. బోటును బయటకు తీయాలంటే ముందు భాగంలో యాంకర్ బిగించి పైకి లాగాలన్న ఆలోచన చేశారు. ఈ ప్రయత్నాల్లో వారు ఉండగా తలా లేని మొండెం వున్న మృతదేహం బయటపడింది. నెలరోజులు దాటి మృతదేహాలు ఉండటంతో జలచరాల బారినపడి మృతదేహాలు ఛిద్రం అయినట్లు తెలుస్తుంది. ఎట్టకేలకు బోటు ను మాత్రం బయటకు తీయడానికి బృందం ఇప్పుడు తమ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసింది. దాంతో తమవారికోసం ఆతృతగా ఎదురుచూస్తున్న బంధువులు సత్యం టీం ప్రయత్నాలు ఫలించాలని ప్రార్ధిస్తున్నాయి. ఈ ఆపరేషన్ మొత్తాన్ని కాకినాడ పోర్ట్ అధికారి పర్యవేక్షిస్తున్నారు. సోమవారం తప్పితే మంగళవారం బోటు బయటకు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయని సత్యం టీం ఆశాభావంతో వుంది.

Tags:    

Similar News