పాపికొండలు పగబడతాయా?

నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమి ఈ ఐదు పంచ భూతాలు అని పిలుస్తారు. మనిషి జీవనానికి ఈ ఐదు అవసరం ఎంతో వీటితో ఏ మాత్రం [more]

Update: 2019-09-16 18:29 GMT

నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమి ఈ ఐదు పంచ భూతాలు అని పిలుస్తారు. మనిషి జీవనానికి ఈ ఐదు అవసరం ఎంతో వీటితో ఏ మాత్రం చెలగాటం ఆడినా ఈ భూతాలు కబళిస్తాయన్నది చరిత్ర నేర్పుతున్న పాఠం. అయితే వీటితో సహవాసం సమయంలో నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలిగొంటుంది అని తెలిసినా అదే పని పదేపదే చేస్తున్నారు అంతా. ఘోర దుర్ఘటనలు జరిగాక ఎవరినో నిందించడం, నష్టపరిహారం అధికంగా పొందేందుకు చేసే డిమాండ్ లు మృతుల ప్రాణాలు వెనక్కి తీసుకురాలేవన్నది సత్యం. పాపికొండల విహార యాత్ర విషాద యాత్రగా మారిన సందర్భాలు గతం నుంచి వర్తమానం వరకు అనేకం. అయినా కానీ చేసిన తప్పుల నుంచి ఎవ్వరు పాఠాలు నేర్చుకోవడానికి ఏ మాత్రం సిద్ధంగా లేకపోవడమే శోచనీయం.

పాపికొండల యాత్రలో …

పాపికొండల విహారయాత్ర ఎంతో రమణీయం అయినది. అయితే గోదావరి లో పడవ ప్రయాణం ద్వారా తిలకించే ఈ యాత్రలో ఎన్నో తప్పులను చేస్తూ వస్తున్నారు బోటు నిర్వాహకులు. అలాగే ప్రయాణికులు సైతం తాము తీసుకోవాలిసిన చిన్నపాటి జాగ్రత్తలను నిర్లక్ష్యంతో పాటించకుండా ప్రమాదం జరిగాక కుటుంబానికి తీరని ద్రోహమే చేస్తున్నారు. తాము గోదావరిలో ఏ సమయంలో ప్రయాణిస్తే మంచిదో ముందుగా పర్యాటకులు గుర్తించాలి. ముఖ్యంగా అక్టోబర్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు గోదావరి లో ఉధృతి ఉండదు. వాతావరణం కూడా అనుకూలించే ఉంటుంది. అదే విధంగా పర్యాటకులు బోటు ను బుక్ చేసుకునేముందు లైఫ్ జాకెట్స్ ధరించడం తప్పనిసరి. అవి అందరికి ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.

డ్రైవర్ల అనుభవం తెలుసుకోండి ….

బోటు నడిపే వారి అనుభవం వివరాలను ముందే ఒకసారి అడిగి తెలుసుకోవాలి. బోటుల నిర్వాహకులు కూడా నీటిలో ప్రయాణం చేసే వారికి విమానంలో జాగ్రత్తలు చెప్పే విధంగానే ముందుగా తెలియచేయాలి. బోటులో కూర్చోవడం దగ్గర నుంచి ప్రమాదం సంభవిస్తే ఎలా బయటపడాలో వివరంగా తెలపాలి. బోటు సామర్ఢ్యానికి మించి పర్యాటకులు వెళ్లేందుకు కానీ వాటి నిర్వాహకులు ప్రయత్నం చేసినా ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. ఈ అంశంలో అటు యజమానులు ఇటు పర్యాటకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

గతంలోనూ అనేక ప్రమాదాలు …

కచ్చులూరు ప్రాంతం గోదావరిలో అత్యంత ప్రమాదకరం. ఇక్కడే గతంలోనూ అనేక బోటు ప్రమాదాలు జరిగి ఎందరో బలయిపోయారు. పోలవరం ఎగువ న దేవీపట్నం దాటిన తరువాత కచ్చులూరు దగ్గర ప్రయాణించే సమయంలో పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలి. అటు ఇటు తిరగడం వల్ల ఆ ప్రాంతంలో సుడులు తిరిగే గోదావరి బోటును పల్టీ కొట్టించే అవకాశాలు ఎక్కువ. మరీ ముఖ్యంగా గాలి, వాన వంటివి వచ్చే వాతావరణం ఉంటే తక్షణం ప్రయాణం నిలిపివేయమని ఏదో ఒక ఒడ్డున లంగరు వేసేలా డ్రైవర్లను కోరాలి.

వరదల సమయంలో…..

వరదల సమయంలో విహారయాత్రలకు వెళ్ళే సాహసం ప్రాణాలకే ప్రమాదమని గోదావరిలో అనేకసార్లు జరిగిన సంఘటనలు చాటి చెబుతున్నాయి. వాహనంపై వెళ్ళేటప్పుడు ప్రమాదవశాత్తు తలకు దెబ్బతగిలితే హెల్మెట్ గుర్తుకు వస్తుంది. నీటిలో కూడా గల్లంతు అయ్యకానో లేక మునుగుతున్నప్పుడు లైఫ్ జాకెట్ గుర్తొచ్చినా ఏమీ ప్రయోజనం ఉండదు. అప్పటికే మన లైఫ్ పూర్తి అయిపోయిందని తెలిసినా చేసేది ఏమి ఉండదు. తాజాగా గోదావరి లో చోటుచేసుకున్న ఘోర సంఘటన మరోసారి పర్యాటకులను, బోటు యజమానులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని పాలకులను హెచ్చరిస్తుంది. ఇలాంటివి పునరావృతం కాకుండా అందరు సమిష్టిగా కృషి చేసినప్పుడే విహార యాత్ర విషాదంగా ముగియకుండా ఆహ్లాదాన్ని అందిస్తుంది.

Tags:    

Similar News