బొబ్బిలి రాజులను తెచ్చేస్తారా.. ?

విజయనగరం జిల్లా మీదనే వైసీపీ ఇపుడు గురి పెట్టింది. ఏకంగా మహారాజు పూసపాటి వంశీకుడు అయిన అశోక్ నే టార్గెట్ చేస్తోంది. ఇది చిన్న విషయం ఏ [more]

Update: 2021-08-15 08:00 GMT

విజయనగరం జిల్లా మీదనే వైసీపీ ఇపుడు గురి పెట్టింది. ఏకంగా మహారాజు పూసపాటి వంశీకుడు అయిన అశోక్ నే టార్గెట్ చేస్తోంది. ఇది చిన్న విషయం ఏ మాత్రం కాదు, తేడా కొడితే 2019లో విజయనగరంలో మొత్తం స్వీప్ చేసిన వైసీపీకి సీన్ రివర్స్ అవుతుంది. అందుకే జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అశోక్ మీద యుద్ధం చేయాల్సిందే. ఇందులో రెండవ మాటకు తావు లేదు. మరి దానికి గానూ తగిన సాధనా సామగ్రిని సమకూర్చుకునే పనిలోనే వైసీపీ ఫుల్ బిజీగా ఉంది మరి.

మొత్తం మారతాయ్….

విజయనగరం జిల్లా రాజకీయాలు మొత్తం మారుతాయ్ అని అంటున్నారు. ఇక్కడ అటు అశోక్, ఇటు బొత్స ఏళ్ల తరబడి రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఈ ఇద్దరూ బయటకు ఎన్ని అనుకున్నా కూడా లోపల తెలియని బంధం ఉంది అంటారు. ఇపుడు వైసీపీలో బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్నా కూడా అశోక్ ని పొలిటికల్ గా అడ్డుకోవడంలేదు అన్న బాధ అయితే వైసీపీలో ఉంది. పైగా ఆయన తన రాజకీయాలనే చూసుకుంటున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. దాంతో వైసీపీలో బొత్స హవాను తగ్గిస్తే జిల్లా రాజకీయాల్లో పట్టు చిక్కుతుందని భావిస్తున్నారుట. బొత్సను విస్తరణలో తప్పిస్తే కొత్త రాజకీయం స్టార్ట్ అవుతుంది అన్న చర్చ ఉంది.

రెడీయేనట …

ఇక గత రెండేళ్లుగా మౌనంగా ఉన్న బొబ్బిలి రాజులు మళ్ళీ వైసీపీ వైపు రావడానికి రెడీ అంటున్నారు. వారికి బొత్స ఏకైక అడ్డంకి అని చెబుతారు. నాడు సుజయ క్రిష్ణ రంగారావు టీడీపీలో చేరిపోవడానికి కూడా బొత్స రాజకీయ ఆధిపత్యమే కారణం తప్ప జగన్ కాదని అంటారు. అంటే బొత్సను పక్కన పెడితే బొబ్బిలి రాజు వచ్చేందుకు ఓకే అన్న మాట. మరో వైపు చూస్తే బొబ్బిలి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు మళ్ళీ గెలిచే చాన్స్ లేదు. ఈసారి జగన్ వేవ్ పెద్దగా ఉండదు, దాంతో సొంతంగా గెలిచే సత్తా ఆయనకు లేదు. దాంతో బొబ్బిలి రాజులను ముందే తెచ్చుకుంటే వారికే టికెట్ ఇచ్చి గెలిపించుకోవచ్చు అన్న మాట కూడా ఉందిట.

ఒక్క దెబ్బకు…

బొబ్బిలి రాజులకు ఇటు పూసపాటి వారితో చారిత్రక వైరం ఉంది. మరో వైపు బొత్సతో రాజకీయ వైరం ఉంది. దాంతో పాటు వారికి సొంతంగా బలం ఉంది. ఈ క్రమంలో బొబ్బిలి రాజులను తిరిగి వైసీపీలోకి తెచ్చేందుకు రంగం సిధ్ధం అవుతోంది అంటున్నారు. అన్నదమ్ములకు రెండు టికెట్లు ఇవ్వడంతో పాటు జిల్లాలో బొత్స ఫ్యామిలీ ఆధిపత్యానికి గండి కొడుతూ కొత్త వారికి చాన్స్ ఇవ్వాలన్నది వైసీపీ పెద్దల అలోచన. అంటే అటు అశోక్ తో పాటు ఇటు బొత్సను కూడా సైడ్ చేసే విధంగానే వైసీపీ జిల్లా రాజకీయాలు ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News