జిత్తుల మారి నాయకుడే… చిత్తయిపోయాడు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, బ్రిటిన్ ప్రధాని మంత్రి బోరిస్ జాన్సన్ మద్య కొన్ని పోలికలున్నాయి. ఇద్దరుా మెుండిఘటాలే. ఎవరి మాటా వినరు. పక్కవారి మాట పెడ [more]

Update: 2020-04-19 17:30 GMT

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, బ్రిటిన్ ప్రధాని మంత్రి బోరిస్ జాన్సన్ మద్య కొన్ని పోలికలున్నాయి. ఇద్దరుా మెుండిఘటాలే. ఎవరి మాటా వినరు. పక్కవారి మాట పెడ చెవిన పెడతారు. సలహాలు, సుాచనలు, పట్టవు. తనకు తోచిందే చేస్తారు. అదే సమయంలో చపల చిత్తులు కుాడా. కనీసం దేశం హితాన్ని కుాడా పట్టించుకోరు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు. ప్రపంచాన్ని కకా వికలం చేస్తున్న కరోనాను ఎదుర్కునే విషయంలో వారు అనుసరించిన వై‌‌ఖరి చివరికి వారి కొంపముంచింది. దేశాన్ని దెబ్బతీసింది. ఆర్ధిక వ్యవస్ధ దెబ్బ తింటుందని వ్యాఖ్యానించిన ట్రంప్ ఇప్పుడు దిక్కుతోచని స్ధితిని ఎదుర్కొంటున్నారు. ఆ‌ఖరికి ముఖానికి మాస్క్ ధరించడానికి కుాడా ఇష్టపడని అగ్రరాజ్యాధినేత ఇపుడు అంతర్జాతీయ సమావేశాలకు వేదిక అయిన న్యూయార్క్ నగరం శవాల దిబ్బగా మారుతుండటంతో నిరుత్తుడయ్యారు. శవాల ఖననాలకు చోటులేకపోవడంతో యావత్ అమెరికా ప్రపంచం నివ్వెరబోతోంది.

మరింత దయనీయం…..

ఇక బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పరిస్ధితి మరింత దయనీయం. దేశాన్ని పక్కనపెడితే ఆయనే స్వయంగా కరోనా బాధితుడయ్యారు. స్వీయ నిర్భంధంతో పాటు ఐసీయూ లోకి వె‌ళ్ళన ఆయన కొద్దిరోజుల చికిత్స అనంతరం బతుకుజీవుడా అంటుా బయటపడ్డారు. దేశవ్యాప్తంగా దాదాపు 90 వేల కరోనా కేసులు నమెాదు కాగా 9 వేల మంది మృత్యువాత పడ్డారు. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని తన కనుసైగలతో శాసించిన ఈదేశం ఇప్పుడు ఈ గండం గట్టెక్కేదెలా అంటుా ఆందోళన చెందుతోంది. ప్రజల్లో ధ్తెర్యాన్ని నింపేందుకు స్వయంగా ఎలిజబెత్-2 రంగంలోకి దిగాల్సి వచ్చింది. పరిస్ధితులు త్వరలో కుదుటపడతాయంటుా జాతినుద్దేశంచి ఆమె చేసిన ప్రసంగం ప్రజల్లో ధైర్యాన్ని నింపంది. గత 66 ఏళ్ళలో బ్రిటన్ రాణి ప్రజలనుద్దేశించి ప్రసంగించడం ఇది అయిదోసారి కావడం గమనార్హం. రాణి కుమారుడు ప్రిన్స్ ఛార్లెస్ కుాడా కరోనా బాధితుడు కావడం గమనించదగ్గ విషయం.

ఎత్తులు వేయడంలో…..

అలగ్జాండర్ బోరిస్ జాన్సన్ . . . బ్రిటన్ ప్రజానికానికి బోరిస్ జాన్నన్ గా సుపరిచితుడు. బ్రెగ్జిట్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ధెరెస్సా నుంచి 2019 జులైలో అధికార పగ్గాలు అందుకున్న ఆయనపై దేశ ప్రజానీకం అనేక ఆశలు పెట్టుకుంది. బ్రెగ్జిట్ గండం నుంచి దేశాన్ని గట్టెక్కిస్తారని, బ్రిటన్ ను మళ్ళీ బలమైన శక్తిగా తీర్చిదిద్దుతారని ప్రజానీకం భావించింది. ఆ ఉద్దేశంతో గత ఏడాది డిసెంబరు 12 న జరిగిన ఎన్నికల్లో ఆయనకు ఘనవిజయాన్ని కట్టబెట్టింది. 2008-2016 మద్యకాలంలో లండన్ నగర మేయర్ గా 2016-18 మధ్య కాలంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన బోరిస్ జాన్సన్ మంచి రచయిత, పాత్రికేయుడు. జిత్తులమారి నాయకుడు కుాడా. ప్రత్యర్ధుల ఎత్తులకు పైఎత్తులు వేయడంలో దిట్ట. కానీ కరోనాను ఎదుర్కొనే విషయంలో పూర్తిగా చతికిలపడ్డారు. దాని తీవ్రతను అంచనా వేయడంలో విఫలమయ్యారు. మార్చి 23 న స్వీయనిర్భందంలోకి వెళ్ళన ఆయన చివరికి లండన్ లోని సెయింట్ ధామస్ ఆసుపత్రిలోని ఐసీయూ లో చికిత్స పొందాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆస్పత్తి ను్చి విడుదల అయినప్పటికీ అవే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

ఇప్పటికైనా…..

బోరిస్ జాన్సన్ చికిత్స పొందుతున్న సమయంలో విదేశాంగమంత్రి డొమినిక్ రాబ్ పాలనా బాధ్యతలు నిర్వహించారు. బ్రిటన్ కు చెందిన మంత్రులు మ్యాట్ హ్యాంకాక్, మైకేల్ గోవ్ సెల్ఫ్ కుాడా స్వీయనిర్భంధంలోకి వెళ్ళారంటే దేశంలో పరిస్ధితి ఎలా ఉందో అర్ధమవుతుంది. ఆస్పత్రుల సామర్ధ్యానికి రెండు ముాడింతల మంది రోగులు వస్తున్నారు. వారిలో ఎవరిని చేర్చుకోవాలో అర్ధంకాని పరిస్ధితి నెలకొంది. రోగనిరోధక శక్తిగల వారు ప్రాణాలు కాపాడుకుంటున్నారు. మిగిలినవారి పరిస్ధితి చెప్పనక్కరలేదు. ప్రజల్లోనుా స్వీయ నియంత్రణ కొరవడింది. ఇప్పటికీ బయటకు వస్తునే ఉన్నారు. డాక్టర్ల పరిస్ధితి దయనీయంగా ఉంది. వారు కుాడా కరోనా వేటుకు గురవుతున్నారు. దీంతో దేశప్రజలు దిక్కుతోచని పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు. కరోనా నుంచి కోలుకున్న బోరిస్ జాన్సన్ ఆరోగ్యరంగంపై తక్షణం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News