గాలానికి చిక్కుతారా?
గాలానికి పడతారా? లేదా? అన్న టెన్షన్ కమలం పార్టీ నేతల్లో ఉండగా, ఎంతమంది వెళ్లిపోతారోనన్న ఉత్కంఠ కాంగ్రెస్, జేడీఎస్ నేతల్లో నెలకొంది. సంక్రాంతి పండగకు ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని [more]
గాలానికి పడతారా? లేదా? అన్న టెన్షన్ కమలం పార్టీ నేతల్లో ఉండగా, ఎంతమంది వెళ్లిపోతారోనన్న ఉత్కంఠ కాంగ్రెస్, జేడీఎస్ నేతల్లో నెలకొంది. సంక్రాంతి పండగకు ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని [more]
గాలానికి పడతారా? లేదా? అన్న టెన్షన్ కమలం పార్టీ నేతల్లో ఉండగా, ఎంతమంది వెళ్లిపోతారోనన్న ఉత్కంఠ కాంగ్రెస్, జేడీఎస్ నేతల్లో నెలకొంది. సంక్రాంతి పండగకు ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని బీజేపీ నేతలు గతంలో ఆర్భాటంగా ప్రకటించి ఫెయిల్ అయ్యారు. ఈసారి బడ్జెట్ సమావేశాల సందర్భంగా అవిశ్వాసం పెట్టి మరీ సంకీర్ణ సర్కార్ ను సాగనంపాలని కమలం పార్టీ ఎత్తుగడ, దీనికి అనుగుణంగా కాంగ్రెస్, జేడీఎస్ లు సయితం తమ ఎమ్మెల్యేలపై ఒక కేన్నేసి ఉంచాయి.
అసమ్మతి నేతలతో…..
కాంగ్రెస్ లో అసమ్మతి నేతలకు కొదవలేదు. అనేక మంది మంత్రి పదవులు దక్కలేదని, తమకు ప్రాధాన్యత ఈ ప్రభుత్వంలో లభించడం లేదన్న దుగ్దతో ఉన్నారు. ఇప్పటికే నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి మరో ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు లభిస్తే చాలు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముంటుంది.
బీజేపీ ఆపలేదు….
మరోవైపు తమ పార్టీకి చెందిన 104 మంది ఎమ్మెల్యేలతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప టచ్ లోనే ఉంటున్నారు. ఏదో కార్యక్రమం పెట్టి అందరు ఎమ్మెల్యేలను ఒకచోట చేర్చి తర్వలోనే గద్దెనెక్కబోతున్నామంటూ సంకేతాలను పంపుతున్నారు. దీంతో కర్ణాటక కమలం పార్టీలో కొంత జోష్ కనపడుతోంది. రాష్ట్ర వ్యాప్త పర్యటన పేరిట 104 మంది ఎమ్మెల్యేలు పర్యటించడం కూడా కాంగ్రెస్ పార్టీ అనుమానాలకు కారణమయింది.
ఎమ్మెల్యేలకు బుజ్జగింపులు…..
దీంతో ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు తరచూ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అసంతృప్త ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు భారీ ఎత్తున నిధులు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. వారితో చర్చించి వారి నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీజేపీ అవిశ్వాసం పెడితే సంకీర్ణ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవన్న సంకేతాలు ఇప్పటికే వెలువడటంతో ఈ మేర ఎప్పటికప్పుడు కుమారస్వామి ఇంటలిజెన్స్ నివేదికలు కూడా తెప్పించుకుంటున్నారు. అయితే ఈసారి కూడా కమలం కల నెరవేరుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.