రీప్లేస్ చేస్తారా?
విజయవాడ టీడీపీ అధ్యక్ష పీఠంపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం విజయవాడ టీడీపీ అధ్యక్షుడిగా బుద్దా వెంకన్న ఉన్నారు. అయితే, బుద్దా పెర్‌ఫార్మెన్స్‌పై పార్టీలో లుకలుకలు [more]
విజయవాడ టీడీపీ అధ్యక్ష పీఠంపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం విజయవాడ టీడీపీ అధ్యక్షుడిగా బుద్దా వెంకన్న ఉన్నారు. అయితే, బుద్దా పెర్‌ఫార్మెన్స్‌పై పార్టీలో లుకలుకలు [more]
విజయవాడ టీడీపీ అధ్యక్ష పీఠంపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం విజయవాడ టీడీపీ అధ్యక్షుడిగా బుద్దా వెంకన్న ఉన్నారు. అయితే, బుద్దా పెర్‌ఫార్మెన్స్‌పై పార్టీలో లుకలుకలు వినిపిస్తున్నాయి. ఆయన వైఖరితో ఎవరూ కలవడం లేదు. అదే సమయంలో బుద్దా వెంకన్న కూడా అందరినీ కలుపుకొని ముందుకు సాగే ప్రయత్నం చేయడం లేదనేది వాస్తవం. అందుకే, కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న కట్టుబాటు విజయవాడ నగరంలో మాత్రం కనిపించడం లేదు. దీంతో బుద్దా వెంకన్నను రీప్లేస్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక, బుద్దా వెంకన్నను విజయవాడ టీడీపీ అధ్యక్షుడిగా ఇప్పటికే రెండోసారి కొనసాగిస్తున్నారు.
వెంకన్న స్థానంలో…..
ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయనను మార్చాలని అధిష్టానం కూడా చూస్తోంది. మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు ఎంపీ కేశినేని నాని సైతం ఆయన్ను వ్యతిరేకిస్తున్నట్టు టాక్. నానికి, ఉమాకు గ్యాప్ ఉన్నా బుద్ధా వెంకన్న విషయంలో మాత్రం వీరు ఒక్కటిగానే ఉంటున్నారట. ఈ క్రమంలో ఈ పదవి కోసం ముగ్గురు కీలక నాయకులు పోటీ పడుతున్నారని అంటున్నారు. వీరిలో ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వంగవీటి రాధా, సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఓడిపోయిన బొండా ఉమామహేశ్వరరావు, తూర్పు ఎమ్మె ల్యే గద్దె రామ్మోహన్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
నానితో సత్సంబంధాలతో…
అయితే, వీరితోపాటు మరికొందరు కూడా పోటీలో ఉన్నారని అంటున్నారు. ఇక, విజయవాడ నగర టీడీపీ అధ్యక్ష రేసులో ఉన్న నాయకుల్లో ఎంపీ కేశినేని వర్గంగా పేరు తెచ్చుకున్నవారికే అగ్రతాంబూలం దక్కుతుందనే ప్రచారం ఉంది. కేశినేని వర్గంలో ప్రస్తుతం ఉన్నది బొండా ఉమా ఒక్కరే. సో.. ఆయనకు ఇస్తారా? అనేది ప్రశ్నగా మారింది. ఇటీవల కాలంలో బొండా ఉమా ఓడిపోయినా కూడా పార్టీ తరపున గట్టి వాయిస్ వినిపిస్తున్నారు. ఫైర్ బ్రాం డ్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. నగరంలోని వ్యాపార వర్గాలతోనూ ఆయన సత్సంబంధాలు ఉన్నాయి.
కాపు సామాజిక వర్గానికే….
ఈ క్రమంలో ఆయనైతే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్త మవుతోంది. ఇక, ఇదే సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధా కూడా ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఖాళీగా ఉండడంతో ఈ పదవి కావాలని ఆయన కోరుతున్నారని అంటున్నారు. అదే సమయంలో చంద్రబాబు సామాజిక వర్గానికే చెందిన గద్దె రామ్మోహన్‌రావు కూడా ఈ రేసులో ఉన్నా.. ఈ దఫా కాపులకు ఈ పదవి దక్కే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఎవరిని ఈ పదవి వరిస్తుందో చూడాలి. కొసమెరుపు ఏంటంటే.. ఎవరు పగ్గాలు చేపట్టినా.. వచ్చే స్థానిక ఎన్నికలు పరీక్ష పెట్టనున్నాయనేది మాత్రం వాస్తవం.