బుద్దా వెంకన్నకు లోకేష్ క్లాస్.. ఏం జరిగిందంటే…!
టీడీపీ విజయవాడ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి , ఎమ్మెల్సీ నారా లోకేష్ క్లాస్ పీకారా? మేం [more]
టీడీపీ విజయవాడ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి , ఎమ్మెల్సీ నారా లోకేష్ క్లాస్ పీకారా? మేం [more]
టీడీపీ విజయవాడ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి , ఎమ్మెల్సీ నారా లోకేష్ క్లాస్ పీకారా? మేం చెప్పినా కూడా మీరు ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారా? అంటే ఔననే అంటున్నారు ఎంపీ కేశినేని నాని వర్గానికి చెందిన కొందరు నాయకులు. వారి ద్వారా తాజాగా కొన్ని విషయాలు లీకయ్యాయి. ఇవే ఇప్పుడు విజయవాడలో హల్‌చల్ చేస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. పార్టీ కార్యక్రమాల్లోనూ, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంలోను కూడా బుద్ధా వెంకన్న ఇటీవల కాలంలో దూకుడుగానే ఉన్నారు.
ట్విట్టర్ లో దూకుడుగా…..
ముఖ్యంగా ట్విట్టర్‌లో ఆయన వైసీపీ ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డిని, అటు సీఎం జగన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడం, విమర్శలు గుప్పించడంతో ప్రధాన మీడియాలో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. నిత్యం ఏదో ఒక రూపంలో వైసీపీపై విమర్శలు చేయడం బుద్దా వెంకన్నకు కామన్‌గా మారింది. ఈ పరిణామమే ఆయనను పార్టీలో కీలక నాయకుడిగా నిలిపింది. ఎవరితోనైనా ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో ప్రముఖంగా ముందుండే బుద్ధా వెంకన్న ఇప్పుడు పార్టీ అధినేత కుమారుడు, మాజీ మంత్రి లోకేష్ నుంచి క్లాస్ వినాల్సి వచ్చిందని ప్రచారం జరుగుతోంది.
ఇంటి నుంచి బయటకు రాక….
తాజాగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. పార్టీ పుట్టి 38 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేయాలని అనుకున్నా.. కరోనా ఎఫెక్ట్‌తో లాక్‌డౌన్ అమలవుతు న్నందున ఎక్కడికక్కడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ అధినేత చంద్రబాబు కూడా హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచే ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇక, జిల్లా, నగర పార్టీ అధ్యక్షులు ఆయా కార్యాలయాలకు వెళ్లి కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఇతర జిల్లాలు, నగరాల్లో కొంత వరకు మెరుగ్గానే ఈ కార్యక్రమం జరిగినా.. విజయవాడలో మాత్రం బుద్ధా వెంకన్న ఇంటి నుంచి బయటకు రాలేదట.
వీరిద్దరి మధ్య…
జిల్లా పార్టీ అధ్యక్షుడు అర్జునుడు కూడా పార్టీ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించారు. కానీ, బుద్ధా వెంకన్న మాత్రం ఎందుకో ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని తెలిసింది. దీంతో ఈ విషయం తెలిసిన లోకేష్ మరుసటి రోజు ఉదయాన్నే ఫోన్ చేసి క్లాస్ పీకారని ఎంపీ వర్గం గుసగుసలాడుతోంది. బుద్దా వెంకన్నకు ఎంపీ నానీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న నేపథ్యంలో ఇలా ప్రచారం జరుగుతోందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏం జరిగిందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.