పెదవి విరిచిన వారే….?
జగన్ కేబినెట్‌లో ఆయనకు మంత్రి పదవి దగ్గడాన్ని కొందరు పెదవి విరిచారు. ఆ.. ఆయన ఏం చేస్తారు ? పెద్దగా లెక్కలు కూడా రావు. అనుభవమా అసలే [more]
జగన్ కేబినెట్‌లో ఆయనకు మంత్రి పదవి దగ్గడాన్ని కొందరు పెదవి విరిచారు. ఆ.. ఆయన ఏం చేస్తారు ? పెద్దగా లెక్కలు కూడా రావు. అనుభవమా అసలే [more]
జగన్ కేబినెట్‌లో ఆయనకు మంత్రి పదవి దగ్గడాన్ని కొందరు పెదవి విరిచారు. ఆ.. ఆయన ఏం చేస్తారు ? పెద్దగా లెక్కలు కూడా రావు. అనుభవమా అసలే లేదు. ఆయన వల్ల జగన్‌కు తలనొప్పులే.. ! అంటూ గుసగుసలు వినిపించాయి. అవి కూడా సొంత పార్టీ వైసీపీ నుంచే కావడం గమనార్హం. ఆయనే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. వరుస విజయాలతో డోన్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బుగ్గన.. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్న సమయంలో ఆయన పీఏసీ చైర్మన్‌గా పనిచేశారు.
ఎవరు ఏమన్నా…..
ఈ నేపథ్యంలోనే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ఖర్చులు, ఆదాయాలు వంటి వాటిని, ప్రజల ఆశలు, ఆశయాలను కూడా అధ్యయనం చేశారు. అంతేకాదు, కీలకమైన ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రచార ఖర్చుపై విరుచుకుపడ్డారు కూడా. దీంతో రాష్ట్రం గురించి అన్ని విషయాలూ తెలిసి ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఆర్థిక మంత్రిగా నియమించుకోవడం వల్ల తనకు ఎనలేని ప్రయోజనం ఉంటుందని భావించిన జగన్.. ఎక్కడా వెనుదిరిగి చూసుకోకుండా.. ఎవరు ఎన్ని సూచనలు, సలహాలు ఇచ్చినా పట్టించుకోకుండా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికే ఈ పదవిని అప్పగించారు.
ఆనం లాంటి వారున్నా….
వాస్తవానికి పార్టీలో చేరిన నాయకుల్లో సీనియర్లు చాలా మంది ఉన్నారు. అంతేకాదు, గతంలో ఆర్థిక మంత్రిగా చేసిన ఆనం రామనారాయణ రెడ్డి వంటి కీలక నేత కూడా ఉన్నారు. వాస్తవానికి ఆర్థిక శాఖను జగన్.. ఆనంకే ఇస్తారని అందరూ అనుకున్నారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోతారని, ఆయనకు మంత్రి పదవి ఇస్తే.. ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రాన్ని గట్టెక్కిస్తారని అనుకున్నారు. అయితే, అనూహ్యంగా జగన్ ఈ పదవిని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కట్టబెట్టడంతో సీనియర్లు సైతం నోరెళ్లబెట్టారు. అయితే, వీరందరి అంచనాలకు భిన్నంగా బుగ్గన ఆర్థిక మంత్రిగా తన సత్తా చాటుకోవడంతోపాటు.. జగన్ ఆశలను, నవరత్నాల హామీలను కూడా నిలబెట్టే ప్రయత్నం చేశారు.
నెంబర్ 2 పొజిషన్ లోనే….
అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్‌ను వండి వార్చారు. ఇక అసెంబ్లీలోనూ తన వాయిస్‌ను గట్టిగా వినిపించారు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి వచ్చే ప్రతి విమర్శకు సాక్ష్యాలు, ఆధారాలతో సహా సభలోనే నిరూపించి శభాష్ అనిపించుకున్నారు. అదే సమయంలో ప్రతిపక్షంపై సామెతలు, ఉదాహరణలతో వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడ్డారు. మొత్తంగా సీఎం జగన్‌తో సమానంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వ వాదనను వినిపించడంతోపాటు.. ప్రభుత్వంలో నెంబర్-2 పొజిషన్‌కు సరైన నాయకుడు అని అనిపించుకోవడం గమనార్హం. దీంతో పెదవులు విరిచిన వైసీపీ నేతలే.. బుగ్గనను చూసి ముక్కన వేలేసుకుంటుండడం విశేషం.