బుట్టా మళ్లీ ప్రయత్నాలు… రాయబారాలు ఫలించేనా..?
ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ సీపీలో ఎమ్మెల్సీల సందడి ప్రారంభమైంది. పార్టీ అధినేత, ప్రభుత్వాధినేత సీఎం జగన్ మూడు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. [more]
ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ సీపీలో ఎమ్మెల్సీల సందడి ప్రారంభమైంది. పార్టీ అధినేత, ప్రభుత్వాధినేత సీఎం జగన్ మూడు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. [more]
ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ సీపీలో ఎమ్మెల్సీల సందడి ప్రారంభమైంది. పార్టీ అధినేత, ప్రభుత్వాధినేత సీఎం జగన్ మూడు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఎస్సీ, మైనార్టీ, ఓసీ అభ్యర్థులకు ఈ మూడు స్థానాలను అప్పగించాలని జగన్ భావిస్తున్నట్టు అధికార పార్టీ అనుకూల మీడియాలో తప్ప మిగిలిన అన్ని మీడియాల్లోనూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ మూడు స్థానాల విషయంలో ఎవరికి వారు అవకాశం కోసం రాయబారాలు నెరుపుతున్నారు. పార్టీ రాజకీయ సలహారుల నుంచి ప్రభుత్వ సలహారులు, బాధ్యుల వరకు కూడా పెద్ద ఎత్తున రాయబారాలు నడుపు తున్నారు.
తాజాగా బుట్టా రేణుక…
పార్టీ కోసం తామెంతో కృషి చేశామని, అయినా ఇప్పటి వరకు తమకు ఎలాంటి గుర్తింపు లభించలేదని కొందరు చెబుతున్నారు. ఇంకొందరు.. పార్టీ కోసం టికెట్లు త్యాగాలు చేశామని అంటున్నారు. అయితే, ఇప్పుడు తాజాగా మరో విన్నపం వెలుగు చూసింది. కర్నూలు జిల్లా కర్నూలు పార్లమెంటు మాజీ సభ్యురాలు.. వైసీపీ నేత బుట్టా రేణుక కూడా ఎమ్మెల్సీ రేసులోకి వచ్చారు. గతంలో ఆమె 2014లో వైఎస్సార్ సీపీ తరఫున ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. బీసీ వర్గానికి చెందిన ఈమె వైస్సార్ సీపీలో మంచి గుర్తింపు పొందారు. నిజానికి ఆ ఏడాది ఎన్నికల్లో కర్నూలు రెండు పార్లమెంటు స్థానాల్లోనూ వైఎస్సార్ సీపీ విజయం సాధించినా.. నంద్యాల నుంచి గెలిచిన దివంగత ఎస్పీవై రెడ్డి గెలుపు గుర్రం ఎక్కిన మర్నాడే.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నా రు.
తిరిగి వైసీపీలో చేరి…..
ఇక, కర్నూలులో వైఎస్సార్ సీపీకి బుట్టా రేణుక మాత్రమే మిగిలారు. అయితే, 2017లో నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం అనంతరం ఆమె వైఎస్సార్ సీపీకి దూరమయ్యారు. చంద్రబాబుకు జై కొట్టారు. అయితే,పార్టీ మారకుండానే వ్యూహాత్మకంగా ఆమె బాబు అభివృద్ది మంత్రానికి ముగ్ధురాలినయ్యాయనని, అందుకే తాను టీడీపీకి మద్దతిస్తున్నానన్నారు. ఇంతలో 2019 ఎన్నికల సమయంలో టీడీపీ తాను కోరుకున్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే స్థానం ఇవ్వకపోయే సరికి మళ్లీ వైసీపీలో కి వచ్చారు. చివరకు టీడీపీలో తన సిట్టింగ్ సీటు అయిన కర్నూలు ఎంపీ సీటు అయినా ఇచ్చే ఛాన్స్ లేదని బుట్టా రేణుకకు అర్థమైంది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలోకి రావడంతో చంద్రబాబు ఎంపీ సీటు ఆయనకు ఖరారు చేసేశారు.
షరతు విధించి….
ఇక ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చిన ఆమెకు టికెట్ ఇచ్చేది లేదని జగన్ షరతు పెట్టారు. మంగళగిరి లాంటి చోట్ల ఆమె వైసీపీ విజయానికి ప్రచారం చేశారు. అప్పటి నుంచి పదవి లేకపోయినా పార్టీలో కొనసాగుతున్నారు. ఇటీవల రాజ్యసభ టికెట్ల వ్యవహారం వచ్చినప్పుడు కూడా బుట్టా రేణుక ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఎలాంటి అవకాశం ఆమెను వరించలేదు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీగా అయినా అవకాశం ఇవ్వాలని ఆమె అడుగుతున్నారు. కానీ, ఇప్పుడు కూడా అవకాశం లేదని స్పష్టమవుతోంది.
9 మాసాలే ఉన్నా….
ఈ నేపథ్యంలో భర్తీ చేయరని భావిస్తున్న మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు చెందిన ఎమ్మెల్సీ స్థానమైనా తనకు ఇవ్వాలని బుట్టా రేణుక కోరుతున్నట్టు వైఎస్సార్ సీపీలో చర్చ జరుగుతోంది. ఈ పదవికి కేవలం 9 మాసాలు మాత్రమే సమయం ఉంది. దీంతో ఎవరూ దీనిని స్వీకరించేందుకు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో తనకైనా ఇవ్వాలంటూ రేణుక లేఖ రాసిందని, ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోందని ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా ఉండే వర్గాలు చెబుతున్నాయి. మరి బుట్టా రేణుక ఆసలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.