సైలెంట్‌గా ఏకేశారుగా.. జగన్ మారేనా…?
ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం అంటే ఆహా ఓహో అన్నవారు ఎక్కువగా కనిపించారు. ఇక, కేంద్రంలోని పలువురు పెద్దలు కూడా వైసీపీ ప్రభుత్వం కొన్ని రంగాల్లో దూసుకు [more]
ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం అంటే ఆహా ఓహో అన్నవారు ఎక్కువగా కనిపించారు. ఇక, కేంద్రంలోని పలువురు పెద్దలు కూడా వైసీపీ ప్రభుత్వం కొన్ని రంగాల్లో దూసుకు [more]
ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం అంటే ఆహా ఓహో అన్నవారు ఎక్కువగా కనిపించారు. ఇక, కేంద్రంలోని పలువురు పెద్దలు కూడా వైసీపీ ప్రభుత్వం కొన్ని రంగాల్లో దూసుకు పోతోందని అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇక, రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైసీపీ నాయకుల పరిస్థితి ఎంత చెప్పుకొంటే.. అంత తక్కువ అనే రీతిలో ఉంది. ఎక్కడ ఏమంత్రి మాట్లాడినా.. ఏ ఎమ్మెల్యే ఎక్కడ నోరు విప్పినా.. జగన్ సర్కారుపై స్త్రోత్ర పాఠాలు వల్లెవేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గల్లీ నుంచి డిల్లీ వరకు జగన్ పాలనపై కనక వర్షం కురుస్తోందని చెప్పుకొంటున్న వైసీపీ నాయకులు పెరిగిపోతున్నారు.
జగన్ వైఖరిని….
అయితే దీనికి భిన్నంగా ఇప్పుడు కేంద్రంలోని స్వయం ప్రతిపత్తి సంస్థ కాగ్.. ఏడాది పాలనపై నివేదికను సమర్పించింది. జగన్ సర్కారు చేస్తున్న అప్పులు, వస్తున్న ఆదాయం.. సంక్షేమ పథకాలు.. కడుతున్న వడ్డీలు.. మార్కెట్ రుణాలు.. ఇలా విభాగాల వారీగా వివరించి మరీ కాగ్ తన నివేదికను వెలువరించింది. దీనిలో అనేక అంశాలను ప్రస్థావించిన కాగ్ నిరుద్యోగం విషయంలోనూ జగన్ అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టిందనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ప్రజలకు ఉచిత పథకాల పేరుతో వచ్చిన నిధులను వచ్చినట్టు మళ్లిస్తున్నారని.. ఇది మున్ముందు రాష్ట్ర ప్రగతికి తీవ్ర ప్రతిబంధకమని కూడా హెచ్చరించింది.
దుబారా నియంత్రణలో…
అయితే.. దుబారా వ్యయ నియంత్రణలో జగన్ సర్కారు బాగానే ఉన్నప్పటికీ ఖజానా సొమ్మును నిర్దిష్ట పనులకు కేటాయించడం, ఖర్చు చేయడం వంటి విషయంలో మాత్రం దూరదృష్టితో వ్యవహరించడం లేదని తలంటేసింది. ఇక, వ్యక్తిగత ఆదాయాలను పెంచడంపైనా .. జగన్ ప్రభుత్వం పనిచేయడం లేదని వివరించింది. అదేవిధంగా జీడీపీ పెంపుపైనా ప్రభావం పడుతోందని, ఆదాయ వృద్ధి మార్గాలను అన్వేషించడం లేదని కూడా కాగ్ నివేదిక స్పష్టం చేసింది.
కేంద్ర నిధులు కూడా…..
కేంద్రం నుంచి తీసుకుంటున్న సంక్షేమ పథకాల సొమ్మును అనిర్దిష్టపు వ్యయం కింద మళ్లిస్తున్నారన్నది కాగ్ ఆరోపణ. అయితే.. ఇదే విధానం కొనసాగితే.. ఆయా పథకాలకు కేంద్రం నుంచి నిధులు కూడా అందే అవకాశం లేదని కాగ్ స్పష్టం చేయడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. జగన్ సర్కారు.. కు పూర్తిస్థాయి మార్కులు పడకపోవడం గమనార్హం. అదే సమయంలో జగన్ పూర్తిగా సంక్షేమం మీద దృష్టి పెట్టి అభివృద్ధిని విస్మరించడాన్ని కూడా ఇక్కడ కాగ్ ప్రస్తావించింది.