రోడ్లపైకి అందుకే రావడం లేదా?

ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అమరావతి రాజధాని అంశం పై పూర్తిగా నిర్లిప్తతే కనిపిస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించినా మా పరిస్థితి ఏమిటి అని మిగిలిన ప్రాంతాల్లో [more]

Update: 2020-01-06 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అమరావతి రాజధాని అంశం పై పూర్తిగా నిర్లిప్తతే కనిపిస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించినా మా పరిస్థితి ఏమిటి అని మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా స్పందన లేదు. అలాగే వైసిపి అమరావతినే కాదు మూడు ప్రాంతాల్లో సమతుల అభివృద్ధికి మూడు రాజధానుల ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టింది. అయితే దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో గట్టి చర్చలే నడుస్తున్నాయి తప్ప ఎవ్వరు ఎలాంటి భావోద్వేగాలకు లోను కావడం లేదు. రాజధాని ఎక్కడైతే మాకు నష్టం లేదు లాభం లేదన్న ధోరణి కన్పిస్తోంది.

అప్పుడే ఏమీ లేదు ….

జరగాలిసిన నష్టం విభజన సమయంలోనే జరిగిపోయింది. విలువైన హైదరాబాద్ ను ఏపీ లోని అన్ని రాజకీయ పార్టీల నేతల చేతగానితనం వల్ల కోల్పోయాం. ఎన్ని పోరాటాలు గత ప్రభుత్వ హయాంలో చేసినా కేంద్రం కరుణించింది లేదు. కాంగ్రెస్ కానీ బిజెపి కానీ అధికారంలో ఉండగా వారు అనుకున్నవే చేశారు కానీ రెండు రాష్ట్రాల ప్రజాభిప్రాయం తీసుకున్నది లేదు. సర్కార్ ఖర్చుతో చంద్రబాబు వీధులు ఎక్కి పోరాటాలు, ఉద్యమాలు చేసినా ఫలితం శూన్యమే అయ్యింది. దీనికోసం విద్యాసంస్థలు వ్యాపారాలు మూసుకుని మరింత నష్టపోవడం అవసరమా? అన్నది ఇప్పుడు ఏపీ వాసుల్లో ఉండటమే ప్రస్తుత స్థితికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

సమైక్య ఆంధ్ర పాఠం నేర్పింది …

సమైక్య ఆంధ్ర కోసం విభజనకు ముందు భారీ ఉద్యమమే సాగింది. అప్పుడు ఏపీలోని 13 జిల్లాలు ఐక్యంగా వుండాలని పోరాడాయి. విభజన తప్పకపోతే హైదరాబాద్ ను కనీసం ఉమ్మడి రాజధాని చేయాలని అంతా కోరుకున్నారు. పార్లమెంట్ లో ఎంపీ లు నాడు నెత్తి నోరు కొట్టుకున్నా పట్టించుకున్న వారే లేకుండా పోయారు. అడ్డగోలుగా విభజన జరిగిపోయింది. తిలాపాపం తలాపిడికెడు అన్న రీతిలో అన్ని పార్టీలు విభజన పాపంలో భాగం అయ్యాయి. ఇక సీమాంధ్రులు ప్రతిఒక్కరికి వ్యక్తిగతంగా జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. విద్యార్థులు విద్యాసంవత్సరం లో క్లాస్ లు జరగక, ఉద్యోగులు, వ్యాపారులు బంద్ లతో దెబ్బయిపోయారు.

నాటివి గుర్తొచ్చే….

ఇవన్నీ గుర్తొచ్చే అమరావతి ఉద్యమం 29 గ్రామాలకు మాత్రమే పరిమితం అయ్యింది. విపక్షాలన్నీ ఒక్కటై అధికారపక్షంపై దుమ్మెత్తిపోస్తూ పోరాటాన్ని ఎంత ప్రేరిపిస్తున్నా కనీసం కృష్ణా, గుంటూరు లలో సైతం ప్రజలు దీన్ని చూసి చూడనట్లే పోతున్నారు. అదే ఇప్పుడు టిడిపి ని వేధిస్తుంది. పార్టీపరంగా రాష్ట్రవ్యాప్తంగా అప్పుడప్పుడు నిరసన కార్యక్రమాలు అరకొరగా సాగుతున్నాయి కానీ సామాన్యులు వీటిలో భాగం కాకపోవడమే నేటి సిత్రం. అందుకే జగన్ సర్కార్ సైతం దూకుడుపెంచినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇదే తీరులో ఉంటే ఈ అంశంలో విపక్షాలకు గట్టి ఝలక్ తగిలినట్లే.

Tags:    

Similar News