అందరూ రెచ్చగొట్టారు.. ఇప్పుడు ఒంటరయ్యారు

రాజధాని అమరావతి రైతులు దాదాపు ఒంటరి వారయినట్లే కన్పిస్తుంది. రాజధాని అమరావతి రైతులను రాజకీయ పార్టీలు కూడా పూర్తిగా వదిలేశాయి. ప్రజాసంఘాలు, మీడియా మద్దతు కూడా వారికి [more]

Update: 2020-06-15 09:30 GMT

రాజధాని అమరావతి రైతులు దాదాపు ఒంటరి వారయినట్లే కన్పిస్తుంది. రాజధాని అమరావతి రైతులను రాజకీయ పార్టీలు కూడా పూర్తిగా వదిలేశాయి. ప్రజాసంఘాలు, మీడియా మద్దతు కూడా వారికి దూరమయింది. దీంతో గత కొంతకాలంగా రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ చేస్తున్న ఆందోళన అక్కడికే పరిమితమయింది. రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు గత 180 రోజులుగా నిరసనలు తెలియజేస్తున్నారు.

ప్రభుత్వం పట్టించుకోకుండా……

అయినా ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి ఏడాది గడిచింది. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్న కీలక నిర్ణయం రాజధాని మార్పు. అభివృద్ధి అంతా అమరావతికే పరిమితం కాకూడదంటూ విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలు కు న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అమరావతిలో అసెంబ్లీ మాత్రమే ఉండనుంది. దీంతో ఇక్కడి రైతులు ఆరు నెలలుగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు.

తొలినాళ్లలో…..

ఉద్యమం మొదలుపెట్టిన తొలినాళ్లలో రాజధాని రైతులకు అందరూ అండగా నిలిచారు. వారివెంట నడిచారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ రాజధాని రైతుల పక్షాన నిలబడి పోరాటానికి దిగింది. వారి ఉద్యమం కోసం విరాళాలను సేకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ తరుపున బస్సుయాత్ర చేపట్టింది. చంద్రబాబు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అమరావతి రైతులకు మద్దతుగా పర్యటించారు. కాని కరోనా వైరస్ రావడంతో చంద్రబాబు జిల్లాల పర్యటన రద్దయింది.

కరోనా కారణంగా?

టీడీపీతో పాటు సీపీఐ కూడా రాజధాని రైతులకు మద్దతు తెలిపింది. ఇక మీడియా సంగతి చెప్పాల్సిన పనిలేదు. రాజధాని రైతులు చేస్తున్న దీక్షలను ప్రతిరోజూ లైవ్ టెలిక్యాస్ట్ చేసేది. కానీ ఇప్పడు మాత్రం మీడియా కూడా వారిని వదిలేసింది. దీంతో రాజధాని అమరావతి రైతులు ప్రస్తుతం ఒంటరి పోరాటం చేస్తున్నారు. కరోనా కారణంగా రాజకీయ పార్టీలు వదిలేశాయి. దీంతో వారు ఇప్పుడు న్యాయవ్యవస్థ మీదే నమ్మకం పెట్టుకున్నారు. మరో వైపు ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులకే మొగ్గు చూపుతుంది. మరి రాజధాని అమరావతి రైతులు ఇంకా ఎన్నిరోజులు ఇలా ఒంటరిపోరాటం చేయాల్సి ఉంటుందో?

Tags:    

Similar News