ఢిల్లీ వణుకుతోంది.. లాక్ డౌన్ మినహాయింపులతోనే?
ఢిల్లీ రాజధాని కరోనాతో వణికిపోతోంది. దేశ రాజధాని కావడంతో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సయితం ఏమీ చేయలేకపోతోంది. వైద్యులు, మంత్రులు, అధికారులు కరోనా బారిన [more]
ఢిల్లీ రాజధాని కరోనాతో వణికిపోతోంది. దేశ రాజధాని కావడంతో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సయితం ఏమీ చేయలేకపోతోంది. వైద్యులు, మంత్రులు, అధికారులు కరోనా బారిన [more]
ఢిల్లీ రాజధాని కరోనాతో వణికిపోతోంది. దేశ రాజధాని కావడంతో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సయితం ఏమీ చేయలేకపోతోంది. వైద్యులు, మంత్రులు, అధికారులు కరోనా బారిన పడుతుండటంతో ఆందోళన పెరిగిపోతుంది. ఒకదశలో ఢిల్లీలో మళ్లీ లాక్ డౌన్ విధించాలని అరవింద్ కేజ్రీవాల్ భావించారు. అయితే లాక్ డౌన్ విధించడం వల్ల ఉపయోగమేమీ లేదని భావించి ఆ ఆలోచనను విరమించుకున్నారు.
కట్టడి చేయలేక…..
ఇక అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో కరోనా ను కట్టడి చేయలేక కేంద్రం సాయాన్ని అర్థించారు. ఒకదశలో అరవింద్ కేజ్రీవాల్ కేవలం ఢిల్లీ వాసులకే కరోనా పరీక్షలు, వైద్యం అందించాలని ఉత్తర్వులు ఇచ్చారు. అయితే దీనికి లెఫ్ట్ నెంట్ గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విపక్షాలుసయితం విమర్శలకు దిగడంతో అరవింద్ కేజ్రీవాల్ వెనక్కు తగ్గారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయి కరోనా కట్టడిపై చర్చించారు.
కేసుల సంఖ్య రోజురోజుకూ….
దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే కరోనా వైరస్ కేసుల సంఖ్య నలభై వేలు దాటింది. రోజుకు రెండు వేల కేసులు నమోదవుతున్నాయి. లాక్ డౌన్ నిబంధనల మినహాయింపుల తర్వాత ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువుతోంది. మరణాల సంఖ్య కూడా పదిహేను వందల వరకూ చేరడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య దాదాపు 25 వేలు ఉంది. దీంతో అమిత్ షా అన్ని పార్టీల నేతలతో కూడా కోవిడ్ నియంత్రణపై చర్చలు జరిపారు.
కట్టడికి అన్ని యత్నాలూ…..
రాజకీయాలకు ఇది సమయం కాదని నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీ నుంచి రోజుకు పద్ధెనిమిది వేల పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రత్యేక ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కరోనా పరీక్షల సంఖ్యను పెంచడంతో పాటు ఆసుపత్రుల సామర్థ్యాన్ని కూడా పెంచాలని అమిత్ షా నిర్ణయించారు. 48 గంటల్లో పరీక్షల ఫలితాలు వచ్చేలా చూసి కరోనా సోకిన వారికి వైద్య సేవలందించాలని కోరారు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగడంతో అరవింద్ కేజ్రీవాల్ ఊపిరి పీల్చుకున్నారు.