ఇక చప్పట్లు లేవు.. తాళాలు లేవు.. అంతా
ఈనెల 8 నుంచి దేవాలయాలు, మాల్స్, రెస్టారెంట్స్ ఓపెన్ అవుతాయని కేంద్రం లాక్ డౌన్ 5 లో ఇప్పటికే మార్గదర్శకాలు కూడా విడుదల చేసేసింది. వీటితో పాటు [more]
ఈనెల 8 నుంచి దేవాలయాలు, మాల్స్, రెస్టారెంట్స్ ఓపెన్ అవుతాయని కేంద్రం లాక్ డౌన్ 5 లో ఇప్పటికే మార్గదర్శకాలు కూడా విడుదల చేసేసింది. వీటితో పాటు [more]
ఈనెల 8 నుంచి దేవాలయాలు, మాల్స్, రెస్టారెంట్స్ ఓపెన్ అవుతాయని కేంద్రం లాక్ డౌన్ 5 లో ఇప్పటికే మార్గదర్శకాలు కూడా విడుదల చేసేసింది. వీటితో పాటు విద్యా సంస్థలు తెరిచే అంశం పైన కూడా జులై లో వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకుంటామని పేర్కొంది. దేశంలో వైరస్ కేసులు బాగా పెరుగుతున్న వేళ ప్రభుత్వాలు ఆర్ధిక కోణంలో ఆలోచించి తీసుకుంటున్న నిర్ణయాలు వైద్య వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. జూన్, జులై లో భారత్ లో మహమ్మారి ముప్పిరి గొంటుంది అని అంతర్జాతీయ సంస్థల నుంచి దేశంలో నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆ సమయంలో మరిన్ని ఆంక్షలు సడలించడంతో అంతా హడలిపోతున్నారు. దాంతో ఇప్పుడు అత్యంత వేగంగా సుమారు రోజుకు 10 వేలకే సుల చొప్పున పెరుగుతున్న దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి నెలకొంటుందని తెలుగు పోస్ట్ ప్రముఖ వైద్యుల అభిప్రాయం సేకరించింది.
ఆ రెండు ఓపెన్ అయితే కష్టమే….
వైరస్ కట్టడికి ప్రధానంగా పాటించాలిసింది సామాజిక దూరం. ఆ తరువాతే మాస్క్ లు, చేతులు పరిశుభ్రత వంటివి. అయితే ప్రార్ధనామందిరాలు, మాల్స్, విద్యా సంస్థల్లో సామాజిక దూరం అనేది అత్యంత క్లిష్టమైన సమస్యే. ఏ ఒక్కరికి పాజిటివ్ ఉన్నా వేలమందికి ఒకేసారి మహమ్మారి సోకుతుంది అని ప్రముఖ వైద్యులు కాకినాడకు చెందిన ఎం ఎస్ జనరల్ డా. టివి బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. మాల్స్, విద్యా సంస్థలు, ప్రార్ధనా మందిరాలు సినిమా హాల్స్ అన్నవి వైరస్ ను వేగంగా ఒకరినుంచి మరొకరికి సోకేలా చేసేవన్నది ఆయన చెబుతున్న మాట. చిన్న పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి బాగా తక్కువ ఉంటుందని విద్యా సంస్థల రీఓపెనింగ్ మరింత ప్రమాదకరమని ఆయన హెచ్చరిస్తున్నారు.
ఆధునిక రీతిలో డా. కర్రి రామా రెడ్డి వైద్యం …
రాజమండ్రికి కి చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు రాష్ట్రపతి అవార్డు ను కూడా అందుకున్న డా. కర్రి రామా రెడ్డి ఇప్పటికే తమ ఆసుపత్రిలో రోగులకు దూరంగా ఉంటూ ఆన్ లైన్ వైద్యాన్ని అందిస్తున్నారు. గతంలోలా ఆయన పేషేంట్స్ సాధక బాధకాలు భౌతికంగా వినే పరిస్థితి లేదు. టెలిఫోన్ ద్వారా లేదా వీడియో కాల్ ద్వారా టెక్నాలజీ తోనే ఆధునిక రీతిలో వైద్యం చేస్తున్నారు. ఆయనది మానసిక సమస్యల తో ఉండే రోగులు కాబట్టి కొంతవరకు ఫరవాలేదు. కానీ మల్టి స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహిస్తున్న డా. టి. వి. బాల కృష్ణ అనేక సమస్యలు చెప్పుకొచ్చారు. ఒక పక్క రోగులకు కరోనా టెస్ట్ లు చేసేందుకు ప్రభుత్వం అనుమతి లేదంటున్నది. ఎవరికి ఉందొ లేదో తెలుసుకోకుండా వైద్యం చేయడం అత్యంత ప్రమాదకరంగా మారిందన్నది ఆయన ఆవేదన. ఇది డా. బాల కృష్ణ సమస్యే కాదు. దేశంలో ప్రవేట్ రంగంలో ఉన్న వైద్యులందరిది.
దేవుడిపై భారం వేయాలిసిందే.ట …
ఇప్పటికే ఎయిమ్స్ నుంచి అనేక చోట్ల వైద్య రంగంలో ఫ్రంట్ ఫ్రంట్ లైన్ లో సేవలు అందిస్తున్న వారు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. వందల సంఖ్యలో ట్రీట్మెంట్ అందిస్తున్న వారికి కరోనా పాజిటివ్ అవుతున్నారు. మరోపక్క అత్యధిక కేసులు ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులలో వైద్య రంగం కుప్పకూలేలా ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. అంతరాష్ట్ర విమాన సర్వీసులు, రైలు, రోడ్డు మొదలు కావడంతో వైరస్ కట్టడి అనేది ఇప్పుడు దేముడిపై భారం వేసి హార్డ్ ఇమ్మ్యూనిటీ ఇమ్మని కోరుకోవడం తప్ప మరొకటి చేసేది ఏమి లేదని వైద్య నిపుణులే చెప్పడం గమనిస్తే అంతా తస్మాత్ జాగ్రత్త.