నాలుగో దఫా లాక్ డౌన్ కు రెడీ అయ్యారా? అయితే?
కేంద్ర ప్రభుత్వం మే 17వ తేదీ వరకూ లాక్ డౌన్ విధించింది. మే 17వ తేదీకి మరో నాలుగు రోజులు గడువు ఉంది. మూడో విడత లాక్ [more]
కేంద్ర ప్రభుత్వం మే 17వ తేదీ వరకూ లాక్ డౌన్ విధించింది. మే 17వ తేదీకి మరో నాలుగు రోజులు గడువు ఉంది. మూడో విడత లాక్ [more]
కేంద్ర ప్రభుత్వం మే 17వ తేదీ వరకూ లాక్ డౌన్ విధించింది. మే 17వ తేదీకి మరో నాలుగు రోజులు గడువు ఉంది. మూడో విడత లాక్ డౌన్ నాలుగురోజుల్లో ముగియనుండటంతో తర్వాత నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే భారత్ లో కరోనా వైరస్ కేసులు పెరగడం ఆగడం లేదు. జూన్, జులై నాటికి భారత్ లో కరోనా కేసులు మరిన్ని పెరగనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 17వ తేదీ తర్వాత ఏం జరగనుందన్న చర్చ సర్వత్రా చర్చనీయాంశమైంది.
రెండు నెలలు గడిచి….
ఇప్పటికే భారత్ లో లాక్ డౌన్ ను విధించి రెండు నెలలు దాటుతుంది. వేలాది మంది ఉపాధి కోల్పోయారు. వ్యాపారాలు తెరుచుకోలేదు. ప్రభుత్వ సాయం కూడా అరకొరగానే ఉంది. లాక్ డౌన్ సమయంలో ఉపాధిలేక అనేకమంది వలస కూలీలు ఇప్పటికే స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారు. గ్రీన్, ఆరెంజ్ జోన్ లలో కొన్ని పరిశ్రమలకు, వ్యవసాయ పనులకు, నిర్మాణరంగ పనులకు అనుమతిచ్చినా పనులు సాగడం లేదు. కూలీలు తమ గ్రామాలకు వెళ్లిపోవడంతో పనులు ప్రారంభం కాలేదు.
ఉపాధి లేక….
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు చేసినా ప్రయివేటు సంస్థల యజమానులు సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగాయి. కరోనా వైరస్ వ్యాప్తి మే 17 వ తేదీకి కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మోదీ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెడ్ జోన్ లలో తప్పించి అన్ని వ్యాపారాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వాలని యోచిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటంతో అన్నింటికి అనుమతులు ఇచ్చేయాలని దాదాపుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తిరుగుబాటు వస్తుందని…
మరోసారి లాక్ డౌన్ ను పొడిగించినా సాధారణ జీవితం ప్రారంభమయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉంటాయంటున్నారు. లేకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదన్న నివేదికలు అందుతున్నాయి. ఇప్పటికే కేంద్ర బృందాలు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ కరోనా వ్యాప్తి పై అధ్యయనం చేస్తున్నాయి. వాటి నుంచి నివేదిక అందగానే మరోసారి మోదీ ముఖ్యమంత్రులతో మాట్లాడే అవకాశముంది. వారి అభిప్రాయాలను కూడా తీసుకుని నిర్ణయం ప్రకటించే అవకాశముంది. మొత్తం మీద మే 17వ తేదీ తర్వాత సాధారణ జీవనం సాగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉంటాయంటున్నారు.