కేంద్రం కిరికిరి సాధ్యమేనా?

ప్రస్తుతం రాష్ట్రంలో జ‌రుగుతున్న అత్యంత కీల‌క‌మైన చ‌ర్చ.. మూడు రాజ‌ధానులు. ఈ నెల 17న సీఎం జ‌గ‌న్ అసెంబ్లీలో చేసిన ఒకే ఒక్క ప్రక‌ట‌న రోజు రోజుకు [more]

Update: 2020-01-01 11:00 GMT

ప్రస్తుతం రాష్ట్రంలో జ‌రుగుతున్న అత్యంత కీల‌క‌మైన చ‌ర్చ.. మూడు రాజ‌ధానులు. ఈ నెల 17న సీఎం జ‌గ‌న్ అసెంబ్లీలో చేసిన ఒకే ఒక్క ప్రక‌ట‌న రోజు రోజుకు తీవ్ర వివాదంగా మారుతోంది. అదే స‌మ‌యంలో దీనిపై విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. ప్రస్తుతం రాజ‌ధానిగా ఉన్న అమ‌రావ‌తిని నిర్మాణం చేయ‌డం అనేది అత్యంత ఖ‌ర్చుతో కూడుకున్న విష‌యంగా చెబుతున్న వైసీపీ ప్రభుత్వం ఇంత ఖ‌ర్చు పెట్టేందుకు నిధులులేవ‌ని అందుకే రాజ‌ధానిని మార్చుతున్నామ‌ని అయితే, అమ‌రావ‌తి మాత్రం కొన‌సాగుతుంద‌ని, కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు ఇక్కడి నుంచి జ‌రుగుతాయ‌ని అంటోంది.

శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే…..

అదే స‌మ‌యంలో ప్రభుత్వం నుంచి అత్యంత కీల‌క‌మైన మ‌రో వాద‌న కూడా వినిపిస్తోంది. రాష్ట్రంలో అనేక ప్రాంతాలు వెనుక‌బ‌డి పోయాయ‌ని, దీనికి గ‌త ప్రభుత్వమే కార‌ణ‌మ‌ని, ఈ క్రమంలో రాజ‌ధానుల‌ను వికేంద్రీక‌రించ‌డం ద్వారా అభివృద్ధి సాధ్యమై.. అన్ని ప్రాంతాలూ స‌మ‌తులంగా అభివృద్ది చెందుతాయ‌ని పేర్కొంటోంది. ఈ క్రమంలోనే ఒక‌ప్పటి 'శ్రీబాగ్‌' ఒప్పందాన్ని తెర‌మీదికి తెచ్చింది. దీని ప్రకారం క‌ర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అదే స‌మ‌యంలో విశాఖ‌లో పాల‌నా రాజ‌ధానిని ఏర్పాటు చేస్తామ‌ని ప్రక‌టించేందుకు రెడీ అయింది.

ఢిల్లీ వెళ్లి తేల్చుకుందామని….

దీంతో రాష్ట్రంలోని రాజ‌ధాని ప్రాంతాలైన అమ‌రావ‌తిలోని 29 గ్రామాల్లో అల‌జ‌డి రేగింది. ఇది రాజ‌కీయ రంగు కూడా పులుముకుంది. ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ స‌హా బీజేపీ వంటివి కూడా రాజ‌ధాని పై జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల్లో పాలు పంచుకుంటున్నాయి. అదే స‌మ‌యంలో నాయ‌కులు ఈ విష‌యాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తామ‌ని అంటున్నారు. ఇక‌, టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడి ప్రజ‌ల‌కు కీల‌క‌మైన సూచ‌న చేశారు. ప్రజ‌లంతా ఢిల్లీ వెళ్లి అక్కడ త‌మ గోడును వినిపించాల‌ని అన్నారు.

సీనియర్ జర్నలిస్టులు సయితం….

ఇవిలా ఉంటే.. శేఖ‌ర్‌గుప్తా వంటి సీనియ‌ర్ పాత్రికేయులు కూడా ఈ విష‌యంలో ప్రధాని న‌రేంద్ర మోడీ జోక్యం చేసుకుని సీఎం జ‌గ‌న్‌ను హెచ్చరిస్తే బాగుండేద‌ని, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సీఎంగా ఉండి ఉంటే ఇలా జ‌రిగేది కాద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో రాజ‌ధాని విష‌యంలో కేంద్రం క‌లుగ జేసుకుంటుందా? అస‌లు కేంద్రానికి రాష్ట్రాల‌పై ఉన్న అధికారాలు ఏంటి? రాజ‌ధానుల నిర్ణయం కేంద్రానిదా? రాష్ట్రాల‌దా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. దీనికి రాజ్యాంగంలోనూ ప‌రిష్కారం ఉంది.

అంతా రాష్ట్రానిదేనంటూ…..

రాజ‌ధానుల ఏర్పాటు, నిర్వహ‌ణ‌, నిర్ణయం వంటివి రాజ్యాంగంలోని రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి. దీంతో ఈ జాబితా విష‌యంలో కేంద్రానికి ఉండే అధికారాలు ప్రత్యేకంగా ఏమీ ఉండ‌వు. గ‌తంలో చంద్రబాబు అమ‌రావ‌తిని ప్రతిపాదించిన‌ప్పుడు కూడా కేంద్రం ఈ విష‌యాన్ని స్పష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. బీజేపీరాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావులు సయితం ఇదే విషయాన్ని చెబుుతన్నారు. కానీ సుజనా చౌదరి మాత్రం కేంద్రం జోక్యం చేసుకుంటుందని స్పష్టంగా చెబుతున్నారు. రాజ‌ధాని అనేది రాష్ట్రాల జాబితాలో అంశ‌మ‌ని ఎక్కడ క‌ట్టుకుంటారు? అనేది రాష్ట్రాల నిర్ణయ‌మేన‌ని గతంలోనే కేంద్రం స్పష్టం చేసింది. సో.. ఇదీ సంగ‌తి.

Tags:    

Similar News