చక్క బడితే…. వదలొచ్చుగా?

జమ్మూకాశ్మీర్ లో పరిస్థితులు చక్క బడుతున్నాయని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే రాజకీయ నేతలపై ఉన్న గృహనిర్భంధాన్ని మాత్రం తొలగించడం లేదు. బడ్జెట్ లో జమ్మూ [more]

Update: 2020-02-09 17:30 GMT

జమ్మూకాశ్మీర్ లో పరిస్థితులు చక్క బడుతున్నాయని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే రాజకీయ నేతలపై ఉన్న గృహనిర్భంధాన్ని మాత్రం తొలగించడం లేదు. బడ్జెట్ లో జమ్మూ కాశ్మీర్ కు వేల కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం అక్కడ రాజకీయ నేతలను మాత్రం ఇంకా టార్గెట్ చేస్తూనే ఉంది. మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీపై ఇంకా గృహనిర్భంధం కొనసాగుతూనే ఉంది. వారిపై మరింత కఠిన మైన కేసులు తాజాగా కేంద్ర ప్రభుత్వం నమోదు చేయడంతో రాజకీయంగా వారిని అణగదొక్కేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు కనపడుతోంది.

మరో కఠినమైన కేసు….

నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధినేత మెహబూబా ముఫ్తీ గత ఆరు నెలల నుంచి గృహనిర్భంధంలోనే ఉన్నారు. ఆర్టికల్ 370 అధికరణను రద్దు చేసిన నాటి నుంచి వారు గృహనిర్భంధంలోనే ఉన్నారు. ఇటీవల ఒమర్ అబ్దుల్లా గడ్డం పెంచుకుని ఉన్న ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన పట్ల సానుభూతి పెరిగింది. అయితే ఆరు నెలల గృహనిర్భంధం ముగిసే సమయంలో ప్రభుత్వం పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేసింది. దీంతో వారిరువురూ కేసులతోనే సతమతమవతున్నారు.

ఆరు నెలల నుంచి….

2019 ఆగస్టు 5వతేదీ నుంచి ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు గృహనిర్భంధంలోనే ఉన్నారు. రెండు సంవత్సరాల పాటు గృహనిర్భంధలో ఉంచే వీలు కల్పిస్తూ 1978లో నాటి ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా ఈ ప్రజాభద్రత చట్టం అమల్లోకి తెచ్చారు. ఈ చట్టాన్ని ఆయన కలప స్మగ్లర్లు,ఉగ్రవాదుల కోసమే తెచ్చినా ఇప్పుడు కాశ్మీరీ రాజకీయ నేతల పాలిట శాపంగా మారింది. ప్రజాభద్రత చట్టం ఒక్క జమ్మూకాశ్మీర్ లోనే ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో జాతీయ భద్రత చట్టం ఉంది.

ఇప్పట్లో సాధ్యం కాదా?

ఈ చట్టాన్ని అనుసరించే కాశ్మీరీ నేతలను ప్రభుత్వం నెలలుగా గృహనిర్భంధంలో ఉంచింది. వారిని గృహనిర్భంధం నుంచి విడుదల చేయాలని విపక్షాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు చక్కబడేంతవరకూ రాజకీయ పార్టీల నేతలు బయటకు రాలేని పరిస్థితి. పౌర సమాజం నుంచి ఎంత వ్యతిరేకత వస్తున్నా వారి విడుదల ఇప్పట్లో సాధ్యపడదనేది రాజకీయ పార్టీల నుంచి విన్పిస్తున్న మాట. మొత్తంమీద కాశ్మీర్ లో విపక్షాల పై బీజేపీ కక్ష్య సాధింపుచర్యలకు దిగుతుందన్నది వాస్తవం.

Tags:    

Similar News