కేంద్రం తీస్తానంటే … ప్రజలు వేస్తామంటున్నారే …?
కరోనా తో లాక్ డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వం కేసులు పెరుగుతున్నా షరతులు సడలిస్తూ వస్తుంది. దేశ ఆర్ధిక గమనాన్ని గాడిన పెట్టాలిసిన తరుణంలో తప్పని స్థితిలో [more]
కరోనా తో లాక్ డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వం కేసులు పెరుగుతున్నా షరతులు సడలిస్తూ వస్తుంది. దేశ ఆర్ధిక గమనాన్ని గాడిన పెట్టాలిసిన తరుణంలో తప్పని స్థితిలో [more]
కరోనా తో లాక్ డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వం కేసులు పెరుగుతున్నా షరతులు సడలిస్తూ వస్తుంది. దేశ ఆర్ధిక గమనాన్ని గాడిన పెట్టాలిసిన తరుణంలో తప్పని స్థితిలో కేంద్రం అడుగులు అన్ లాక్ వైపే పడుతున్నాయి. అన్ లాక్ 2.0 ముగిసి అన్ లాక్ 3.0 కి దగ్గరగా సమయం వచ్చేసింది. ఈనెల 31 తో కేంద్రం ఆంక్షల గడువు ముగియనుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా గతం కన్నా దారుణంగా కేసుల సంఖ్య అడ్డు అదుపు లేకుండా పెరుగుతుంది. అయితే రికవరీ శాతం కూడా ఎక్కువ ఉండటం పరిస్థితి కొంత ఆశాజనకమే అని చెబుతుంది. ఇదొక్కటే అందరికి ఊరట.
భయం గుప్పిట్లో వ్యాపారులు …
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాపార వర్గాలు కరోనా బారిన అత్యధికంగా పడుతున్నారు. దాంతో బాటు ఆంక్షల కారణంగా తక్కువ సమయంలో వ్యాపార కార్యకలాపాలు పూర్తి చేయాలిసి ఉండటంతో జనం ఒక్కసారిగా ఎగబడుతున్నారు. ఫలితంగా భౌతిక దూరం అన్నది చాలా చోట్ల లేకుండా పోయింది. దాంతో వ్యాపారులు చాలా సులభంగా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో వర్తక సంఘాలు స్వీయ లాక్ డౌన్ విధించుకుంటున్నాయి. స్థానిక అధికార యంత్రాంగాలు ఓపెన్ చేసుకునే అవకాశం కల్పించినా వ్యాపార వర్గాలు ముందుకు రావడానికి వెనుకాడుతున్నాయి.
థియేటర్ల కు ఒకే చెప్పే ఛాన్స్ …
అన్ లాక్ 3.0 లో సినిమా ధియేటర్లు తెరిచేందుకు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వొచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. దీనిపై వివిధ రాష్ట్రాల అభిప్రాయాల తరువాత కేంద్రం నిర్ణయం ఫైనల్ చేయనుంది. అయితే విద్యా సంస్థలను ఆగస్టు లో ప్రారంభించేందుకు మాత్రం కేంద్రం నో చెబుతుందని అంటున్నారు. వచ్చే నెలలో మరింతగా కరోనా విజృంభిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యా సంస్థలను తెరవడంపై ఆగస్టు చివరి వారంలోనే నిర్ణయాన్ని కేంద్రం తీసుకోనుంది.