ముఖ్యమంత్రి మార్పు తధ్యమా? తప్పదట

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. విజయ్ రూపానీ పనితీరు పట్ల కేంద్ర నాయకత్వం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రధాని [more]

Update: 2020-05-20 18:29 GMT

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. విజయ్ రూపానీ పనితీరు పట్ల కేంద్ర నాయకత్వం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు కూడా విజయ్ రూపానీ వైఖరి పట్ల ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. దీంతో గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి విజయ్ రూపానీని తప్పించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

సొంత రాష్ట్రం కావడంతో….

గుజరాత్ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల స్వరాష్ట్రం. గుజరాత్ నుంచే వారు జాతీయ స్థాయికి ఎదిగారు. గుజరాత్ పాలన పరంగా దాదాపు దశాబ్దం అనుబంధం ఉంది. గుజరాత్ అసెంబ్లీ, అక్కడ జరిగే పార్లమెంటు ఎన్నికలను ఇద్దరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. స్వరాష్ట్రం కావడంతో ఇక్కడ బీజేపీ విజయం సాధించకపోతే విపక్షాల పరంగా, పార్టీ పరంగా కూడా ఇద్దరూ విమర్శలు ఎదుర్కొనక తప్పదు. మోదీ, అమిత్ షాలు ఢిల్లీలో ఉన్నా మనసంతా గుజరాత్ పైనే ఉంటుంది.

గత ఎన్నికల్లోనే చావు తప్పి….

గుజరాత్ లో ఆరు దఫాలుగా బీజేపీ గెలుస్తూనే వస్తోంది. మూడు దశాబ్దాల నుంచి కాంగ్రెస్ కు ఇక్కడ గెలుపు అవకాశం లభించలేదు. అయితే మోదీ, షాలు ఢిల్లికి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వెలువడ లేదు. మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా చేరుకుని ఊపిరి పీల్చుకుంది. కాంగ్రెస్ గత ఎన్నికల్లోనే గుజరాత్ లో పుంజుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాతనే విజయ్ రూపానీకి మరోసారి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించకూడదని తొలుత భావించారు.కానీ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా విజయ్ రూపానీనే ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు.

వచ్చే ఎన్నికల నాటికి……

అయితే ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ లో కరోనా కేసులు సంఖ్య ఎక్కువగా ఉంది. దాvదాపు పదివేల కేసులకు పైగానే నమోదయ్యాయి. 700 మరణాలు సంభవించాయి. 2022లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగగున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ కరోనా ఎఫెక్ట్ కూడా మరో రెండేళ్లు ఉండక మానదు. దీంతో కరోనా కట్టడిలో విఫలమయిన ముఖ్యమంత్రిగా కేంద్ర నాయకత్వం విజయ్ రూపానీని భావిస్తుంది. ఆయనను మారుస్తారన్న టాక్ బలంగా విన్పిస్తుంది.

Tags:    

Similar News