ఆయుధం అవుతుందనుకుంటే… అలా అయిందే?

ఏదైనా గుప్పిట మూసేంత వరకే రహస్యం. తెరిస్తే ఏమీ ఉండదు. ఇప్పుడు అమరావతి విషయంలోనూ అదే నిజమైంది. ఇప్పటి వరకూ చంద్రబాబు అమరావతిని నమ్ముకుని రాజకీయాలు నడుపుతూ [more]

Update: 2021-02-24 03:30 GMT

ఏదైనా గుప్పిట మూసేంత వరకే రహస్యం. తెరిస్తే ఏమీ ఉండదు. ఇప్పుడు అమరావతి విషయంలోనూ అదే నిజమైంది. ఇప్పటి వరకూ చంద్రబాబు అమరావతిని నమ్ముకుని రాజకీయాలు నడుపుతూ వస్తున్నారు. ఐదు కోట్ల మంది ప్రజలు రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. న్యాయపరంగా దానిపై పోరాటం చేస్తామని చెబుతున్నారు. ఇక అమరావతి ప్రాంతంలో రైతులు కూడా గత 425 రోజులకు పైగానే ఉద్యమాలు చేస్తున్నారు.

ఏ మాత్రం ప్రభావం లేదే…?

కానీ రాజధాని అమరావతి ప్రభావం రాష్ట్రంలో ఎక్కడా లేదన్నది అర్థమయింది. ప్రధానంగా రాజధాని ప్రాంతంలో అనేక రోజులుగా ఉద్యమాలు నడుస్తున్నా ఎన్నికల ఫలితాల్లో మాత్రం అది కన్పించలేదు. నిజానికి రాజధాని తరలిస్తామని, మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించి దాదాపు పథ్నాలుగు నెలలు కావస్తుంది. ఈ పథ్నాలుగు నెలల నుంచి ఇక్కడ భూముల ధరలు పడిపోయాయి. చిరు వ్యాపారాలు కూడా జరగడం లేదన్న వార్తలు వస్తున్నాయి.

నచ్చచెప్పి… బుజ్జగించి….

అయినా సరే ఇక్కడి ప్రజలు మరోసారి పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలవడం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకూ పార్టీనేతలకు అమరావతి విషయంలో నచ్చ చెబుతూ వచ్చారు. రాజధాని అమరావతి తరలించడం ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా ఇష్టం లేదని ఆయన పదే పదే చెప్పుకొచ్చారు. రాయలసీమ లో హైకోర్టు వచ్చినందున ప్రయోజనం లేదని ఆ ప్రాంతనేతలను బుజ్జగించారు. కానీ ఎన్ని చేసినా అమరావతి విషయాన్ని రాష్ట్ర ప్రజలు లైట్ గా తీసుకున్నారన్నది మాత్రం ఫలితాలను బట్ట తేలింది.

ఎన్నో ఆశలు…..

అందుకే నిన్న మొన్నటి వరకూ అమరావతి విషయంలో మాట్లాడిన నేతలు పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత నోరు మెదపడం లేదు. అమరావతి తనకు అందివస్తుందని చంద్రబాబు పెద్ద ఆశలు పెట్టుకున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ సంగతి దేవుడెరుగు.. కనీసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ టీడీపీకి అనుకూల ఫలితాలు రాకపోవడంపై ఆయన సీనియర్ నేతలతో విశ్లేషణలు చేస్తున్నారు. అమరావతి ఆయుధం అవుతుందనుకుంటే అది ప్రత్యర్థి చేతికి దానిని అందించినట్లయిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News