పులివెందులలో వేలు పెడితే అంతేనా?

పులివెందుల అంటే కొత్తగా పరిచయం అక్కరలేని పేరు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి నుంచి తరచూ విన్పించేదే పులివెందుల పంచాయతీ. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత [more]

Update: 2020-03-30 02:00 GMT

పులివెందుల అంటే కొత్తగా పరిచయం అక్కరలేని పేరు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి నుంచి తరచూ విన్పించేదే పులివెందుల పంచాయతీ. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల. అయితే ప్రస్తుతం పులివెందులలో పార్టీని నిలబెట్టడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన ప్రయత్నాలు ఏవీ ఫలించడం లేదని తెలుస్తోంది.

సతీష్ రెడ్డి రాజీనామాతో….

పులివెందుల టీడీపీ నేత అంటేనే సతీష్ రెడ్డి గుర్తుకొస్తారు. ఆయన సుదీర్ఘకాలంగా టీడీపీ నేతగా పులివెందులలో కొనసాగుతున్నారు. విజయం సాధించకపోయినా ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూ క్యాడర్ లో ధైర్యాన్ని, పార్టీలో ఉత్సాహాన్ని నింపుతూ వస్తున్నారు. ఆయన పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ లపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్ కుటుంబానికి బద్ధ శత్రువుగా సతీష్ రెడ్డికి పేరుంది.

ఆఫర్ రావడంతోనే….

అయితే సతీష్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన వైసీపీలో చేరలేదు. చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినందునే ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. పులివెందులలో వైఎస్ కుటుంబాన్ని కాదని రాజకీయం చేయలేమని సతీష్ రెడ్డికి తెలియంది కాదు. అలాగని పార్టీ తనకు. తన వెంట ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే ఆయన టీడీపీలోనే కొనసాగి ఉండేవారు. పార్టీ కూడా పట్టించుకోక పోవడం, వైసీపీ నుంచి ఆఫర్ రావడంతో ఆయన టీడీపీకి రాజీనామా చేశారు.

బీటెక్ రవిని నియమించినా…..

సతీష్ రెడ్డి రాజీనామా చేయగానే పులివెందులకు పార్టీ ఇన్ ఛార్జిగా బీటెక్ రవిని చంద్రబాబు నియమించారు. అయితే ఆయనకు అక్కడ పార్టీ క్యాడర్ ఎవరూ సహకరించడం లేదని చెబుతున్నారు. కనీసం ఆయన వెంట నడిచే వారే లేరని చెబుతున్నారు. క్యాడర్ అంతా సతీష్ రెడ్డి వెంటనే వెళ్లిపోవడంతో బీటెక్ రవి దాదాపు ఒంటరిగానే అయ్యారు. రెండు మూడుసార్లు ప్రయత్నించిన బీటెక్ రవి ఇక క్యాడర్ తో మాట్లాడే ప్రయత్నాన్ని కూడా విరమించుకున్నారట. మొత్తం మీద పులివెందులలో వేలు పెట్టడం అంత సామాన్య విషయం కాదని బీటెక్ రవికి అర్థమయిందంటున్నారు.

Tags:    

Similar News