బ్యాడ్ నేమ్ రాకూడదని…?

కోడెల శివప్రసాద్ మరణించిన తర్వాత వాళ్ల కుటుంబం రాజకీయంగా ఎదుగుతుందా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కోడెల కుటుంబం విషయంలో [more]

Update: 2019-09-25 08:00 GMT

కోడెల శివప్రసాద్ మరణించిన తర్వాత వాళ్ల కుటుంబం రాజకీయంగా ఎదుగుతుందా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కోడెల కుటుంబం విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి సర్వత్రా చర్చగా మారింది. కోడెల శివప్రసాద్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ వేధింపుల కారణంగానే కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని సాక్షాత్తూ చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కోడెల శిపవ్రసాద్ అంతియ యాత్రంలో మొదటి నుంచి చంద్రబాబు పాల్గొని ఆయనకు ఘన నివాళులర్పించారు.

కోడెల కుటుంబానికి….

ఇప్పటి వరకూ అంతా బాగానే ఉన్నా కో్డెల సన్నిహితుల్లో కోడెల కుటుంబానికి తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత దొరుకుతుందా? లేదా? అన్న సందేహం నెలకొంది. కోడెల శివప్రసాద్ కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు శివరాం కోడెల శిపవ్రసాద్ స్పీకర్ గా ఉన్న సమయంలో సత్తెన పల్లి నియోజకవర్గ బాధ్యతలను చూసుకున్నారు. అయితే కోడెల శివరాంపై అనేక ఆరోపణలు అప్పుడే వచ్చాయి. ప్రతి పనిలో కమీషన్లు, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలను కోడెల శివరాం ఎదుర్కొన్నారు. దీంతో కోడెల శివప్రసాద్ బతికి ఉండగానే చంద్రబాబు కొడుకు విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పడం విశేషం.

పార్టీకి సేవలను గుర్తించి…..

కోడెల శివప్రసాద్ పార్టీలో సీనియర్ నేత. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ కోసం శ్రమించిన నేత. ఆయన పార్టీలోనూ, అధికారంలో ఉండగా ఎన్నో పదవులు దక్కించుకున్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో సీనియర్ నేతగా ఉన్నారు. కేవలం నరసరావుపేటకే కాకుండా గుంటూరు జిల్లా మొత్తంలో కోడెల శివప్రసాద్ అభిమానులున్నారు. అయితే కోడెల మరణం తర్వాత ఆయన వారసులకు పార్టీలో ప్రాధాన్యం ఉంటుందా? అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. కోడెల కుమారుడిపై ఆరోపణలు, కేసులు ఉండటంతో చంద్రబాబు పక్కన పెట్టే అవకాశముందని మొదట భావించారు.

కీలక పదవి ఇచ్చి…..

కాని కోడెల శివప్రసాద్ పార్టీకిచేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఆయన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కోడెల శివరాంకు పార్టీలో కీలక పదవిని ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అలాగే సత్తెనపల్లి ఇన్ ఛార్జిగా కూడా కోడెల శివరాంను నియమిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై అక్కడి నేతలతో త్వరలోనే చంద్రబాబు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.కోడెల కుటుంబానికి చంద్రబాబు అన్యాయం చేశారన్నచెడ్డపేరు రాకుండా శివరాంకు పార్టీలో ప్రాధాన్యత కల్పించాలని బాబు డిసైడ్ అయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే దీనిపై చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Tags:    

Similar News